Akhil Akkineni: అఖిల్ సినిమాకు అనుకోని కష్టాలు.. ఏజెంట్ మరోసారి వాయిదా తప్పదా..?

Akhil Akkineni: అఖిల్ సినిమాకు అనుకోని కష్టాలు.. ఏజెంట్ మరోసారి వాయిదా తప్పదా..?
Akhil

అక్కినేని యంగ్ హీరో అఖిల్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు అఖిల్ చేసినా సినిమాల్లో లాస్ట్ గా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఒక్కటే పర్లేదు అనిపించుకుంది

Rajeev Rayala

|

May 11, 2022 | 6:50 PM

అక్కినేని యంగ్ హీరో అఖిల్(Akhil Akkineni) సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు అఖిల్ చేసినా సినిమాల్లో లాస్ట్ గా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఒక్కటే పర్లేదు అనిపించుకుంది.ఈ సినిమా హిట్ టాక్ తెచుకున్నా.. ఆ హిట్ అక్కినేని అభిమానులకు సరిపోలేదు. తమ హీరోకి సాలిడ్ హిట్ కావాల్సిందే అని ఆశ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు అఖిల్ హీరోగా స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఏజెంట్‌. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌తో గతేడాది సూపర్‌ హిట్‌ను అందుకున్న అఖిల్‌, ఇప్పుడు అదే జోరును కొనసాగించేందుకు ఏజెంట్‌ రూపంలో రానున్నాడు. ఇప్పటి వరకు లవర్‌ బాయ్‌గా కనిపించిన అఖిల్‌ తొలిసారి ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో అఖిల్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్లు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి.

సిక్స్‌ ప్యాక్‌ బాడీతో అఖిల్‌ మేకోవర్‌ చూసిన ఆయన ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోయారు. చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని.. 2022 ఇండిపెండెన్స్ డే వీక్ లో ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా అనుకున్న టైంకి వస్తుందా అన్న అనుమానం మొదలైంది. దానికి కారణం అదే సమయంలో యంగ్ హీరోల సినిమాలన్నీ క్యూ కట్టాయి. నితిన్ హీరోగా ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు. సమంత నటించిన పాన్ ఇండియా మూవీ ‘యశోద’ కూడా అదే రోజున రానుంది. నాగచైతన్య నటించిన తొలి హిందీ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఇలా వరుస సినిమాలు అఖిల్ సినిమాకు పోటీగా ఉన్నాయి. దాంతో మరోసారి ఏజెంట్ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇకఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా సాక్షి వైద్య నటిస్తోంది. ఇక ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల తమన్‌ సంగీతం అందించిన దాదాపు అన్ని సినిమాలు విజయాన్ని అందుకుంటుండడంతో ఏజెంట్‌ మ్యూజిక్‌పై కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కోవిడ్ పాజిటివ్.. మానసికంగా ధైర్యంగా ఉన్నానంటూ పోస్ట్..

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ పై సింహాంలా గర్జించిన మహేష్..

Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..

ఇవి కూడా చదవండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu