Sarkaru Vaari Paata: మహేష్ మొదట చెప్పనున్న ఈ డైలాగ్ ఇప్పుడు క్రేజీగా మారి ఫ్యాన్స్ చేత విజిల్స్ కొట్టిస్తుంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైలాగ్ డెలివరీలో మనోడిది సపరేట్ స్కూల్. ఇన్‌టెన్సివ్‌గా.. వెరీ పవర్‌ ఫుల్ గా.. స్టెయిట్ గా డైలాగ్ డెలివర్నీ చేయడంలో మహేషే టాప్.

Sarkaru Vaari Paata: మహేష్ మొదట చెప్పనున్న ఈ డైలాగ్ ఇప్పుడు క్రేజీగా మారి ఫ్యాన్స్ చేత విజిల్స్ కొట్టిస్తుంది..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: May 02, 2022 | 5:20 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu).. డైలాగ్ డెలివరీలో మనోడిది సపరేట్ స్కూల్. ఇన్‌టెన్సివ్‌గా.. వెరీ పవర్‌ ఫుల్ గా.. స్టెయిట్ గా డైలాగ్ డెలివర్నీ చేయడంలో మహేషే టాప్. అందుకే ఆయనను డైరెక్ట్‌ చేసే ప్రతీ డైరెక్టర్ మహష్‌ కోసమే కొన్ని స్పెషల్ డైలాగ్స్ రాస్తుంటారు. ఆడైలాగులతో వారి రైటింగ్‌ను కూడా పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పరశురామ్ సినిమాలో డైలాగ్స్ చాలా ఇన్‌టెన్సివ్‌గా. పవర్ ఫుల్ గా ఉంటాయి.

అలా తాజాగా సర్కారు వారి పాట కోసం కూడా… పరుశురామ్ ఓ పవర్ ఫుల్ డైలాగ్‌ను … స్పెషల్లీ మహేష్ కోసమే రాశారు. ఈ రోజు విడుదలైన ట్రైలర్ లో మహేష్ చెప్పిన డైలాగ్స్ అభిమానుల చేత విజిల్స్ కొట్టిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా “100 వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చార్రా..” అని తనను కొట్టేందుకు వచ్చిన రౌడీలను బెదిరిస్తూ.. మహేష్ చెప్పిన డైలాగ్‌ ప్రస్తుతం అందర్నీ క్రేజీ గా ఆకట్టుకుంటోంది. అయితే మొదట్లో మహేష్ ఈ డైలాగ్ ను చెప్పేందుకు ఇష్ట పడలేదట. ఎక్కడ మిస్‌ ఫైర్ అవుతుందేమోనన్న భయంతో.. వేరే డైలాగ్ రాయమని డైరెక్టర్ పరుశురామ్ కు చెప్పారని తెలుస్తోంది. కాని డైరెక్టర్ పరుశురామ్ ఎలాగైన మహేష్ తో ఈ డైలాగ్ చెప్పించాలని గట్టిగా ఫిక్సై.. ఎలాగైనా ఈ డైలాగ్ చెప్పాలని పట్టుబట్టారట. దీంతో అయిస్టంగానే ఈ డైలాగ్‌ చెప్పారట మహేష్. కాని ఇదే డైలాగ్ ప్రస్తుతం మహేష్ ఫ్యాన్ను విపరీతంగా ఆకట్టుకుటోంది. మాస్‌ ఆడియెన్స్ మాత్రం ఈ డైలాగ్ ను ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. థియేటర్స్ ఈ డైలాగ్ ఫ్యాన్స్ చేత విజిల్స్ కొట్టించడం ఖాయం అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు షాక్ ఇచ్చిన లీకర్స్.. సోషల్ మీడియాలో మూవీ ఫైట్ సీన్..

Satyajit Ray: భారతీయ సినిమాలో కొత్త ఒరవడి సృష్టించిన ప్రజ్ఞాశాలి సత్యజిత్‌రాయ్‌

Viral Photo: బూరె బుగ్గల చబ్బీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..

Telugu Movies: ఈవారం మరింత ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..