Mahesh Babu: బాబు అంటే ఆ రేంజ్ ఉంటుందిగా! అఖిల్ రిసెప్షన్‌లో మహేష్ ధరించిన టీ-షర్ట్ ఎన్ని లక్షలో తెలుసా?
అఖిల్ అక్కినేని వెడ్డింగ్ రిసెప్షన్‌లో మహేష్ బాబు ధరించిన కలర్ ఫుల్ టీ-షర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అభిమానులు, నెటిజన్లు ఈ ఖరీదైన టీ షర్ట్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బాబు అంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

స్టార్ హీరోలు, క్రికెటర్లు ధరించే చొక్కాలు, ప్యాంటు, బ్యాగులు, చెప్పుల ధరల గురించి తరచు చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు బహిరంగంగా కనిపించినప్పుడు వారు ధరించే దుస్తుల ధరల గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు.ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ధరించిన టీ-షర్ట్ పై కూడా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇటీవలే పెళ్లిపీటలెక్కాడు. జైనబ్ రవ్జీతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం (జూన్ 8) హైదరాబాద్‌లోని అక్కినేని స్టూడియోస్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అక్కినేని అఖిల్ వివాహం జరిగింది. దీంతో నాగార్జున ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు చాలా మంది సెలబ్రిటీలను ఆహ్వానించారు. అందుకు తగ్గట్టుగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అఖిల్-జైనాబ్ ల రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార రిసెప్షన్ కు వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ బాబు ధరించిన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా టీ షర్ట్ సింపుల్ గా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దుస్తుల బ్రాండ్ ‘హెర్మ్స్’ నుండి వచ్చిన టీ-షర్ట్. దీని ధర సుమారు 1.51 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ టీషర్ట్ ధరతో ఒక లగ్జరీ బైక్ కొనుగోలు చేయవచ్చని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ బాబు ఫ్యామిలీ..
The Akkineni family extends a heartfelt welcome to the beloved superstar @urstrulyMahesh & family.
Your presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/tpP2Dq51pK
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025
ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్నిఅప్ డేట్స్ రానున్నాయి.
A moment filled with love, blessings, and togetherness. Grateful to have our family by our side.
More memories to come… 💫❤️#AkhilZainabReception pic.twitter.com/kYlqFVRAkq
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.