Mahesh Babu: రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన మహేశ్ బాబు.. భార్య నమ్రత పేరిట రిజిస్ట్రేషన్.. ఎక్కడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజిబిజీగా ఉంటున్నాడు. గుంటూరు కారం సినిమా తర్వాత రానున్న ఈ మూవీ కోసం ప్రిన్స్ బాగా కష్టపడుతున్నాడు. పాన్ వరల్డ్ మూవీ కావడంతో సినిమాకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.

Mahesh Babu: రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన మహేశ్ బాబు.. భార్య నమ్రత పేరిట రిజిస్ట్రేషన్.. ఎక్కడంటే?
Mahesh Babu Family

Updated on: Mar 10, 2024 | 10:43 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజిబిజీగా ఉంటున్నాడు. గుంటూరు కారం సినిమా తర్వాత రానున్న ఈ మూవీ కోసం ప్రిన్స్ బాగా కష్టపడుతున్నాడు. పాన్ వరల్డ్ మూవీ కావడంతో సినిమాకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. మహేశ్ బాబు తాజాగా రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అంతేకాదు ఆ భూమిని తన సతీమణి నమ్రతా శిరోద్కర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారట. హైదరాబాద్ శివార్లలోని శంకర్ పల్లి సమీపంలోని గోపులారం పరిధిలో ఈ భూమిని కొన్నారట మహేష్. రిజిస్ట్రేషన్ కోసం శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి నమ్రతా వెళ్లింది. అక్కడే సుమారు రెండు గంటల పాటు వేచి ఉండి రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసుకున్నారట. దీంతో అక్కడున్న జనాలు, ఉద్యోగులు, స్థానికులు నమ్రతాతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారని సమాచారం. నమ్రత కూడా ఎంతో ఓపికగా అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇచ్చిందట. మహేష్ బాబు కొనుగోలు చేసిన ఈ రెండున్నర ఎకరాల భూమి నమ్రతా శిరోద్కర్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి.

మహేశ్ సతీమణి గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు నమ్రతా శిరోద్కర్. మహేశ్ బాబు ఫౌండేషన్ నిర్వహణా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో పలు మల్టీప్లెక్స్ లు, రెస్టారెంట్లను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇక కుటుంబ వ్యవహారాలు, వ్యాపారాన్ని కూడా నమ్రతానే చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు. కాగా రాజమౌళి- మహేష్ కాంబోలో రాబోయే సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ ప్రాజెక్టులో మహేష్ మొత్తం ఎనిమిది గెటప్స్ లో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కనుంది.

ఇవి కూడా చదవండి

నమ్రతకు మహేశ్ బర్త్ డే విషెస్

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.