AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Fauzi : ఫౌజీలో మహేష్ బాబు మేనల్లుడు… ప్రభాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి మూవీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

Prabhas Fauzi : ఫౌజీలో మహేష్ బాబు మేనల్లుడు... ప్రభాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Oct 28, 2025 | 2:57 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రంతో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్నారట. అతడు మరెవరో కాదు.. తెలుగు హీరో సుధీర్ బాబు చిన్న కుమారుడు.. మహేష్ బాబు మేనల్లుడు దర్శన్. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీలో కీలకపాత్రలో కనిపించనున్నాడట. చిన్న వయసులో ప్రభాస్ పాత్రను దర్శన్ పోషించనున్నట్లు సమాచారం. అంటే ఈ సినిమాలో దర్శన్ జూనియర్ ప్రభాస్ గా కనిపించనున్నాడు.అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఫౌజీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే దర్శన్ లుక్ టెస్ట్ పూర్తైందని.. అతడి యాక్టింగ్ చూసి మేకర్స్ సైతం ఫిదా అయ్యారని తెలుస్తోంది.

డైరెక్టర్ హను రాఘవపూడి, ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఫౌజీ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఇమాన్వీ కథనాయికగా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల డార్లింగ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమాపై హైప్ పెంచేసింది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుందిం. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో ఘట్టమనేని వారసుడికి అవకాశం రావడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమానే కాకుండా మహేష్ బాబు నిర్మిస్తోన్న గుఢాచారి 2 చిత్రంలోనూ దర్శన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం జటాధర సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. నవంబర్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో సోనాక్షి సిన్హా, శిల్ప శిరోద్కర్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. కొన్నాళ్లుగా సుధీర్ బాబు పెద్ద కొడుకు చరిత్ మానస్ తెరంగేట్రంపై అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చరిత్ మానస్ తన మేనమామ మహేష్ బాబును పోలిన లుక్స్, మేనరిజమ్స్ తో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. దీంతో అతడిని జూనియర్ మహేష్ అంటూ ట్యాగ్స్ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ జూనియర్ ప్రభాస్ గా కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?