AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ.. బాబు దుమ్మురేపాడట.. ఫ్యాన్స్‌కు పూనకాలే

బాక్సాఫీస్ వేడెక్కడం ఖాయమనే సంకేతాలు ఇప్పటికే వెళ్లిపోయాయి. పైగా ఎప్పటికప్పుడు నిర్మాత నాగవంశీ సైతం సినిమాపై అంచనాలు పెంచేస్తూనే ఉన్నాడు. ఫైట్లు అలా వచ్చాయి.. డాన్సులు ఇలా వచ్చాయి.. సీన్స్ ఎలా ఉన్నాయో తెలుసా అంటూ టైమ్ వచ్చినపుడు గుంటూరు కారంపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు వంశీ. తాజాగా గుంటూరు కారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

Guntur Kaaram: గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ.. బాబు దుమ్మురేపాడట.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Guntur Kaaram
Praveen Vadla
| Edited By: |

Updated on: Jan 04, 2024 | 8:00 PM

Share

సంక్రాంతి సినిమాల్లో మేజర్ షేర్ గుంటూరు కారందే. అక్కడున్నది మహేష్ బాబు కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా త్రివిక్రమ్ కూడా తోడున్నాడు కాబట్టి ఇంక తగ్గేదే లే. బాక్సాఫీస్ వేడెక్కడం ఖాయమనే సంకేతాలు ఇప్పటికే వెళ్లిపోయాయి. పైగా ఎప్పటికప్పుడు నిర్మాత నాగవంశీ సైతం సినిమాపై అంచనాలు పెంచేస్తూనే ఉన్నాడు. ఫైట్లు అలా వచ్చాయి.. డాన్సులు ఇలా వచ్చాయి.. సీన్స్ ఎలా ఉన్నాయో తెలుసా అంటూ టైమ్ వచ్చినపుడు గుంటూరు కారంపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు వంశీ. తాజాగా గుంటూరు కారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు అక్కడ్నుంచి ఊహించిన దానికంటే మంచి టాక్ వచ్చిందని తెలుస్తుంది.

ముఖ్యంగా మహేష్ బాబును కొన్నేళ్లుగా ఎలాగైతే చూడాలని ఫ్యాన్స్ కలలు కంటున్నారో.. అలాగే త్రివిక్రమ్ చూపించాడంటున్నారు. మరోవైపు ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ సినిమాకు హైలైట్ అవుతాయని.. దాంతో పాటు యాక్షన్ సీన్స్.. సూపర్ స్టార్ కృష్ణ రిఫెరెన్స్.. మిర్చి యార్డ్‌లో శ్రీలీల, మహేష్ బాబు వేసిన నక్కిలీసు గొలుసు పాట డాన్సులు ఇవన్నీ మేజర్ హైలైట్స్ అంటున్నారు. మరోవైపు సెకండాఫ్‌లోనూ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని.. రమ్యకృష్ణ, మహేష్ బాబు మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కవుట్ అవుతాయంటున్నారు. అన్నింటికీ మించి నిర్మాత నాగవంశీ చెప్పినట్లు చివరి 45 నిమిషాలు సినిమాకు ఆయువు పట్టు అంటున్నారు.

అల వైకుంఠపురములో, అత్తారింటికి దారేది స్థాయిలోనే ఎమోషనల్ క్లైమాక్స్‌ను ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కచ్చితంగా మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అయ్యే లక్షణాలన్నీ గుంటూరు కారంలో ఉన్నాయని తెలుస్తుంది. మరోవైపు శ్రీలీల, మీనాక్షి చౌదరి స్క్రీన్ ప్రజెన్స్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయని చెప్తున్నారు. అన్నింటికి మించి మహేష్ బాబు స్టైలింగ్‌కు తోడు.. ఆయన డైలాగ్ డిక్షన్ కూడా కొత్తగా ఉందని.. గుంటూరు యాసలో ఇరగదీసినట్లు తెలుస్తుంది. కొన్ని డైలాగ్స్ అయితే రిపీటెడ్ మోడ్‌లో మోగడం ఖాయం అంటున్నారు. సినిమాలో యాక్షన్ పార్ట్ కాస్త ఎక్కువగా ఉండటంతో.. U/A ఇచ్చారు కానీ పండక్కి పిల్లలతో కలిసి కుటుంబం అంతా చూడగలిగే క్లీన్ ఎంటర్‌టైనర్ ఇది అంటున్నారు. జనవరి 12న విడుదల కానుంది గుంటూరు కారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.