Mahesh Babu: బాబోయ్.. లంగావోణిలో దేవకన్యలా మహేష్ బాబు అన్న కూతురు.. వీడియో వైరల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుపుతుంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మహేష్ ఫ్యామిలీ నుంచి కొత్తతరం హీరోహీరోయిన్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Mahesh Babu: బాబోయ్.. లంగావోణిలో దేవకన్యలా మహేష్ బాబు అన్న కూతురు.. వీడియో వైరల్..
Bharathi Ghattamaneni

Updated on: Aug 15, 2025 | 5:40 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గుంటూరు కారం సినిమాతో హిట్టుకొట్టిన మహేష్..ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ నెలకొంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే.. మహేష్ ఫ్యామిలీ నుంచి కొత్తతరం నటవారసులు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే మహేష్ కూతురు, కొడుకు గౌతమ్ ఘట్టమనేని, సితార ఘట్టమనేని సినిమాల్లోకి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని, సుధీర్ బాబు దంపతుల తనయుడు చరణ్ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ బాబు అన్నకూతురు రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేనికి సంబంధించిన లేటేస్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ పెళ్లి వేడుకలో రమేష్ బాబు కుటుంబం సందడి చేసింది. రమేష్ బాబు సతీమణితోపాటు ఆయన కూతురు, కొడుకు ఆ వీడియోలో కనిపిస్తున్నారు. అందులో భారతి ఘట్టమనేని లంగావోణిలో ఎంతో అందంగా.. అచ్చం దేవకన్యలా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

ఇదిలా ఉంటే.. భారతి ఘట్టమనేని త్వరలోనే కథానాయికగా తెరంగేట్రం చేయనుందంటూ ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దర్శకుడు తేజా కుమారుడు, భారతి ఘట్టమనేని కాంబోలో ఓ సినిమా రాబోతుందని ప్రచారం నడుస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియరాలేదు. ప్రస్తుతం భారతికి సంబంధించిన వీడియో మాత్రం ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?