Savitri : ఆ విదేశీ క్రికెటర్‌కు మహానటి సావిత్రి వీరాభిమాని.. అతను ఎవరంటే..
ఒకప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లకు పోటీగా నటించి అందరి మన్నలను అందుకున్నారు ఆమె. కేవలం ఆమె కోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులు కూడా ఉండేవారు.

మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఆమె అందం, అభినయం ఎన్నటికీ మరిచిపోలేనివి. ఎంతో సహజంగా నటించి అవదులులేని అభిమానాన్ని సొంతం చేసుకున్నారు సావిత్రి. ఒకప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లకు పోటీగా నటించి అందరి మన్నలను అందుకున్నారు ఆమె. కేవలం ఆమె కోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులు కూడా ఉండేవారు. పోస్టర్ పై సావిత్రి ఫోటో కనిపిస్తే చాలు ఆ సినిమా థియటర్స్ నిడిపోయేవట. సినిమాలతోనే కాదు సేవాగుణంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు సావిత్రి. తెలుగు, తమిళ్ భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పించడమే కాదు.. దర్శకురాలిగాను తన ప్రతిభను చాటుకున్నారు.
ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లరు సావిత్రి. అయితే ఆమె జీవితం అనుకున్నంత సజావుగా సాగలేదు జెమినీ గణేష్‌ను పెళ్లాడిన తర్వాత ఆమె జీవితం ఊహించని విధంగా మారిపోయింది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలు ఉండటంతో పలు కష్టాలను అనుభవించింది. చివరకు మద్యానికి బానిస అయ్యింది. ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది.
ఇక సావిత్రికి మల్లెపూలు, వర్షం అంటే చాలా ఇష్టమట. అలాగే ఆమెకు క్రికెట్, చెస్ అంటే కూడా చాలా ఇష్టమట. అంతే కాదు ఆమె దగ్గర ఏనుగు దంతాలతో చేసిన చెస్ బోర్డు కూడా ఉండేది. చెన్నై లో క్రికెట్ మ్యాచ్ జరిగితే ఆమె తప్పకుండా వెళ్లి చూసేవారట. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు గ్యారీ సోబర్స్ కు సావిత్రి వీరాభిమాని. అలాగే పాటలో శివాజీ గణేష్ తో కలిసి సినిమా తారల క్రికెట్ పోటీలలో కూడా ఆమె పాల్గొన్నారు. చివరిగా సావిత్రి తీవ్ర అనారోగ్యానికి గురై ఏడాది పాటు కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.





Gary Sobers
