Karate Kalyani: సినీనటి కరాటే కళ్యాణికి మంచు విష్ణు వార్నింగ్.. ‘మా’ నుంచి షోకాజ్ నోటీసులు..
మా సభ్యురాలు, సినీనటి కరాటే కళ్యాణికి మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజు నోటీసులు. ఇటీవల ఎన్టీఆర్ పై కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటిసులు జారి చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మంచు విష్ణు ఆదేశించారు.

మా సభ్యురాలు, సినీనటి కరాటే కళ్యాణికి మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజు నోటీసులు. ఇటీవల ఎన్టీఆర్ పై కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటిసులు జారి చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మంచు విష్ణు ఆదేశించారు. ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ పై కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణుడి రూపంలో తారకరామారావు విగ్రహాన్ని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టింది. ఖమ్మంలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణను నిలిపివేయాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఆమె పేర్కొంది.
దేవుడి రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాని కరాటే కళ్యాణి తెలిపింది. తాజాగా ఈ వివాదంలో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. మా అసోసియేషన్ నుంచి ఆమెకు షోకాజ్ నోటీసులు పంపించారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ వివాదంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల పొడవైన శ్రీకృష్ణుని రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం అందించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమారు. అయితే శ్రీకృష్ణుడు రూపంలోని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడంపై కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆమె యాదవ సంఘాలు, కొన్ని హిందూ సంఘాలతో కలిసి పోరాటం చేస్తోంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని ఆమె చెబుతూ వస్తోంది.





Maa Association
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.