MAA Elections 2021: మా ఎన్నికలు ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. రాజకీయ ఎన్నికల సమయంలో గొడవలు జరిగినట్లుగానే.. మా ఎన్నికల పోలింగ్ సమయంలోనూ ఘర్షణలకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు ముగియనుంది. ఇంకా ఇంకా రెండున్న గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్టార్ హీరోలు దూరంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఓటు వేయిన హీరోలు.. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేష్, నాగ చైతన్య, వరుణ్ తేజ్, రానాలు ఉన్నారు.
సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్దానాలు.. ఇవీ గత కొన్ని రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కనిపిస్తోన్న పరిస్థితి. సాధారణ రాజకీయ ఎన్నికలను తలదన్నె రీతిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల అగ్గి రాజుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ ఎన్నికల ఫలితం అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇటు సామాన్య జనాల్లోనూ ఆసక్తి నెలకొంది.
కాగా, ఎన్నడు లేనంతగా ఈ ఎన్నికల్లో రచ్చ జరుగుతోంది. అందరం ఒక్కటేనని విష్ణు, ప్రకాశ్ రాజ్ చెప్పిన కొద్దిసేపటికే ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని ఎన్నికల అధికారికి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయంలో విష్ణు ప్యానెల్‌కు చెందిన శివ బాలాజీ, ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన హేమ మధ్య గొడవకు దిగారు. ఎవరికి వారే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రంగలోకి దిగిన పోలీసులు గొడవలు సద్దుమణిగేలా చర్యలు చేపడుతున్నారు.