Lokesh Kanagaraj: మారిన లోకేష్… పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న కూలీ
లియో విషయంలో లోకేష్ కనగరాజ్ లెక్కలు తప్పాయి. అప్పటికే దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్టుగా ప్రకటించటంతో లియో సినిమాను హడావిడిగా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ కూడా ముందే లాక్ అవ్వటంతో, డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు చాలా కష్టపడ్డారు. కానీ

సౌత్ సినిమాకు యూనివర్స్ ల ట్రెండ్ పరిచయం చేసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. డ్రగ్స్ మాఫియా నేపధ్యంలో వరుస సినిమాలు చేసిన లోకేష్ కనగరాజ్. ఆ సినిమాలన్నింటినీ కనెక్ట్స్ చేస్తూ వస్తున్నారు. ఖైదీ, విక్రమ్, లియో సినిమాల కథలను ఒకదానికితో ఒకటి కనెక్ట్ చేసేలా లీడ్స్ వదిలారు. ఈ సినిమాల్లో రోలెక్స్ లాంటి ఇంట్రస్టింగ్ గెస్ట్ రోల్స్ ను కూడా చూపించి అప్ కమింగ్ సినిమాల మీద అచనాలు పెంచేశారు. భారీ యాక్షన్ సినిమాలు రూపొందిస్తున్నా… వాటిని షార్ట్ టైమ్ లోనే కంప్లీట్ చేయటం లోకేష్ స్టైల్.
లియో విషయంలో లోకేష్ లెక్కలు తప్పాయి. అప్పటికే విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్టుగా ప్రకటించటంతో లియో సినిమాను హడావిడిగా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ కూడా ముందే లాక్ అవ్వటంతో, డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు చాలా కష్టపడ్డారు. కానీ ఆ ఎఫెక్ట్ సినిమా అవుట్ పుట్ మీద పడింది. అందుకే లియో అనుకున్న రేంజ్ లో పర్ఫెమ్ చేయలేదు. రిలీజ్ తరువాత ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించారు లోకేష్. భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగవని గట్టిగా చెప్పారు.
కూలీ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా వర్క్ ఫినిష్ చేశారు లోకేష్. ముందు నుంచి పక్కా ప్లాన్ తో ఉన్న లోకేష్, స్క్రిప్ట్ స్టేజ్ లోనే మ్యాగ్జిమమ్ ప్లానింగ్ ఫినిష్ చేశారు. తరువాత కూడా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి ప్రామిస్ చేయకుండా సినిమాను అనుకున్న క్వాలిటీతో తెరకెక్కించేందుకు ట్రై చేశారు. నలుగురు టాప్ స్టార్స్ నటించినా… కూడా షార్ట్ స్పాన్ లోనే షూటింగ్‌ను పూర్తి చేశారు లోకేష్.
సూపర్ వ్రాప్ పేరుతో షూటింగ్ పూర్తయినట్టుగా వెల్లడించిన లోకేష్ కనగరాజ్ ఇప్పటికీ రిలీజ్ డేట్ ను మాత్రం లాక్ చేయలేదు. ఫైనల్ అవుట్ మీద ఫుల్ క్లారిటీ వచ్చిన తరువాతే సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నది లోకేష్ ఆలోచన. నిర్మాతలు కూడా అదే ఆలోచనలో ఉండటంతో ఫస్ట్ కాపీ రెడీ అయ్యే వరకు వెయిట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. లియో విషయంలో జరిగిన పొరపాట్లు మళ్లీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నారు లోకేష్.
కూలీ తరువాత చేయబోయే సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇచ్చినా… సెట్స్ మీద ఉన్న సినిమాను నెమ్మదిగా పూర్తి చేస్తున్నారు. ఆ తరువాతే ఎల్ సీ యూ భాగంగా ఖైదీ 2ను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు లోకేష్ కనగరాజ్.