Happy Birthday Movie Teaser : ఇంటింటికీ గన్నూ.. ఎదురులేని ఫన్నూ.. ఆకట్టుకుంటోన్న హ్యాపీ బర్త్ డే టీజర్..
అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే అందం , అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది.

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi). తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ.. దుసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రస్తుతం లావణ్య బిజీ హీరోయిన్ గా మారింది. యంగ్ హీరోలతో పాటు.. నాగార్జున లాంటి సీనియర్ హీరోలతోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది లావణ్య. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో ఇంట్రస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హ్యాపీ బర్త్ డే అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో రానున్న ఈ సినిమాకు మత్తువదలరా.. ఫెమ్ రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ”ఆయుధాల చట్టం అంటే ఏంటి సుయోధనా.?’ అని ఎవరో ప్రశ్నించగా.. దానికి కమెడియన్ సత్య ‘ఇంటింటికీ గన్నూ.. ఎదురులేని ఫన్నూ’ అంటూ సమాధానం ఇస్తాడు. ఈ డైలాగ్ తో టీజర్ మొదలైంది. టెన్త్ ఫెయిల్ అయినా గన్ బిల్ మాత్రం పాస్ చేసి తీరుతానని వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్.. ఆకట్టుకుంది. గన్స్ అమ్మడం.. కొనుగోలు చేయడం.. గన్స్ కోసం జనాలు పోటెత్తడం ఈ టీజర్ లో చూపించారు. అలాగే బర్త్ డే పార్టీలో లావణ్య భారీ తుపాకీతో కాల్పుల వర్షం కురిపించడం చూపించారు. మొత్తంగా ఈ టీజర్ చాలా క్రేజీగా ఉంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.








