AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silk Smitha: ఆమె మరణం ఇప్పటికీ వీడని మిస్టరీ.. ఒంటరితనంతో పోరాడిన సిల్క్ స్మిత..

చిన్న వయసులోనే పెళ్లి.. ఇంట్లో కష్టాల నుంచి పారిపోయి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మేకప్ ఆర్టిస్ట్ అయ్యింది. ఆ తర్వాత నటిగా మారింది. హీరోయిన్ కావాలనుకుంది కానీ కుదరలేదు. తక్కువ సమయంలోనే ఊహించని పేరు, డబ్బు, హోదా సంపాదించి కేవలం 36 ఏళ్ల వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ప్రేమ, నమ్మకం చేతిలో మోసపోయి చివరకు ఒంటరితనంతో పోరాడి ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు (డిసెంబర్ 2న) సిల్క్ స్మిత జయంతి.

Silk Smitha: ఆమె మరణం ఇప్పటికీ వీడని మిస్టరీ.. ఒంటరితనంతో పోరాడిన సిల్క్ స్మిత..
Silk Smitha
Rajitha Chanti
|

Updated on: Dec 02, 2023 | 1:10 PM

Share

ఒకప్పుడు సినీపరిశ్రమలో సిల్క్ స్మిత లేడీ సూపర్ స్టార్. దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది. కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. మత్తెక్కించే కళ్లు.. అందచందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె కోసమే ప్రతి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా చూసుకునేవారు దర్శకనిర్మాతలు. సిల్క్ డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం ఎదురుచూసేవారు. స్టార్ హీరోహీరోయిన్లకు మించి పారితోషికం తీసుకున్న ఏకైక నటి. అయితే తెరపై అందచందాలతో ప్రేక్షకులకు కవ్వించిన సిల్క్ .. జీవితం మాత్రం కన్నీటి చెర. చిన్న వయసులోనే పెళ్లి.. ఇంట్లో కష్టాల నుంచి పారిపోయి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మేకప్ ఆర్టిస్ట్ అయ్యింది. ఆ తర్వాత నటిగా మారింది. హీరోయిన్ కావాలనుకుంది కానీ కుదరలేదు. తక్కువ సమయంలోనే ఊహించని పేరు, డబ్బు, హోదా సంపాదించి కేవలం 36 ఏళ్ల వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ప్రేమ, నమ్మకం చేతిలో మోసపోయి చివరకు ఒంటరితనంతో పోరాడి ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు (డిసెంబర్ 2న) సిల్క్ స్మిత జయంతి.

సిల్క్ స్మిత.. 1960 డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జన్మించింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. ఇంటి పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో కేవలం నాల్గవ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. బాల్యం మొత్తం కష్టాలతోనే గడిపింది. చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. కానీ అక్కడ తనకు కష్టాలు వదల్లేదు. భర్త, అత్తమామలు పెట్టే బాధను భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి చెన్నై చేరుకుంది. అక్కడ తనకు వరుసకు అత్తయ్య అయ్యే మహిళతో నివసించింది. నటి కావాలనే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో హీరోయిన్లకు మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఆ సమయంలోనే హీరోయిన్ కావాలనుకుంది. ఆమె ప్రయత్నాలు ఫలించి 1979లో మలయాళం సినిమా ఈనాయే తేది చిత్రంలో తొలిసారిగా నిటంచింది. అదే ఏడాదిలో తమిళంలో పండిచక్రమ్ సినిమాలో సిల్క్ అనే పాత్రలో నటించింది. ఆ తర్వాత తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది.

ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని ఊహించని స్టార్ డమ్ అందుకుంది. తన మ్యాజిక్ నటనతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పట్లో సిల్క్ లేకపోతే సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ సైతం ముందుకు రాలేదంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కేవలం 17 ఏళ్ల వయసులోనే దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించింది. సహాయ నటిగా కాకుండా స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. కేవలం సిల్క్ స్మితను చూసేందుకే అప్పట్లో అడియన్స్ థియేటర్లకు వచ్చేవారు. హీరోయిన్ కావాలనుకున్న స్మిత కల మాత్రం కలగానే మిగిలిపోయింది. ఆమెకు ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ మాత్రమే వచ్చేవి.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు స్టార్ హీరోస్ అందరి సినిమాల్లో నటించింది సిల్క్. కానీ 90లో స్మితకు అవకాశాలు తగ్గిపోయాయి. మరోవైపు తన చుట్టూ ఉన్నవాళ్లు సిల్క్ డబ్బును తీసుకోవడం.. ప్రేమించిన మనిషి మోసం చేయడంతో మానసికంగా కుంగిపోయింది. మరోవైపు నిర్మాతగా మారి రెండు సినిమాలు నిర్మించింది. కానీ ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో అప్పులు పెరిగిపోయాయి. ఓవైపు ప్రేమ మోసం మానసిక క్షోభ.. మరోవైపు అప్పులు పెరగడంతో ఆమె డిప్రెషన్‏లోకి వెళ్లిపోయింది. చివరకు తన మనసులోని బాధను నోట్ రాసి 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది. కానీ సిల్క్ సూసైడ్ చేసుకోలేదని.. హత్య చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరికొందరు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందని అన్నారు. సిల్క్ మరణించి 27 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆమె మరణంపై అనుమానాలు మాత్రం వీడలేదు.