
జయప్రకాష్ రెడ్డి దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించాడు. తన మేనరిజం, స్పెషల్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విలన్ గా, కమెడియన్ గా మెప్పించాడు. 74 ఏళ్ల వయసులో మరణించారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో జయప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్థిక ఇబ్బందులతో సినీ రంగం నుంచి ఐదేళ్లు దూరమైన జయప్రకాష్ రెడ్డి, తన రెండో ఇన్నింగ్స్ గురించి తెలిపారు. అప్పుల్లో కూరుకుపోయి, జీతం లేకుండా తొమ్మిదేళ్లు గడిపిన తాను, తిరిగి సినిమా పరిశ్రమలోకి ఎలా వచ్చారో తెలిపారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. రామానాయుడు వంటి గొప్ప స్టార్ ప్రొడ్యూసర్ సైతం చిన్న ఆర్టిస్టులతో ఎంతో వినయంగా ఉండేవారని, ఆయనలో గర్వం అనేదే లేదని అన్నారు. తన సినీ రంగంలో మొదటి ఇన్నింగ్స్ తర్వాత భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయానని, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. సుమారు 20-25 సినిమాలు చేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఐదేళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నానని తెలిపారు. తన జీవితంలో తొమ్మిదేళ్లు జీతం లేకుండా గడిపానని, అయినప్పటికీ చాలా మంది స్నేహితులు తనకు ఆర్థికంగా అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. అప్పుల్లోంచి బయటపడి, తన మీద తనకు అసహ్యం పుట్టి, తాను కష్టపడి పైకి వచ్చానని, మళ్లీ కష్టపడాలనే సంకల్పంతో సొంత నిర్ణయంతో తిరిగి సినీ పరిశ్రమలోకి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించానని జయప్రకాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
సినీ పరిశ్రమను విడిచిపెట్టిన తర్వాత మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది, ఏడాదిన్నర, రెండున్నరేళ్లు ఇలా సమయం గడిచిపోయిందని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది తన సొంత నిర్ణయమేనని, తన భార్య కూడా అందులో జోక్యం చేసుకోలేదని జయప్రకాష్ రెడ్డి చెప్పారు. సురేష్ బాబు నిర్మించిన ప్రేమించుకుందాం రా సినిమా తన కెరీర్ మార్చిందని.. ఈ మూవీతోనే తన అప్పులన్నీ తీరిపోయాయని అన్నారు. ఆ సినిమా తర్వాత తాను వెనుదిరిగి చూడలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..