Lata Mangeshkar: గాన కోకిల అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న వేళ.. వైరల్ అవుతోన్న వీడియో..
వివాదాలకు అతీతంగా.. అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. తన గానంతో పాటకు మరో రూపాన్ని అద్ది.. భారత నైటింగేల్
వివాదాలకు అతీతంగా.. అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. తన గానంతో పాటకు మరో రూపాన్ని అద్ది.. భారత నైటింగేల్ అని పేరు సంపాదించుకున్నారు లతా మంగేష్కర్ (Lata Mangeshkar).. తన గాత్రంతో కొన్ని వేల పాటలను ఆలపించిన ఆ స్వరం ఇప్పుడు మూగబోయింది. ఆమె పాట వినాలని ప్రతిపూట పరితపించేవారు అనేకం.. గానంతో ఎంతో మంది శ్రోతలను మైమరపించారు. దశాబ్ధాలుగా తన గాత్రంతో దేశవ్యాప్తంగా ప్రజలను అలరించిన ఆ గానకోకిల ఇకలేరు.. సంగీత ప్రియులను ఒంటరిచేసి.. స్వరానికి విశ్రాంతి కల్పిస్తూ తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్… పాట వింటే చాలు భావితరాలు పులకించి పోతాయి. అలాంటి గానకోకిల ఈరోజు ఉదయం కన్నుమూశారు.
గత కొద్ది రోజుల క్రితం కోవిడ్ స్వల్ప లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. కానీ వయసు దృష్ట్యా ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్ మరణవార్త తెలియగానే యవత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. సోషల్ మీడియాలో ఆమె అరుదైన చిత్రాలను.. వీడియోలను షేర్ చేసుకుంటాన్నారు. ఈ క్రమంలో లతా మంగేష్కర్ దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నప్పటీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 2001లో లతా మంగేష్కర్ అప్పటి భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ నుంచి ప్రతిష్టాత్మకమైన భారతరత్న గౌరవాన్ని అందుకున్నారు. ఆ అరుదైన జ్ఞాపకాలను మీరు ఓసారి చూసేయ్యండి..
#WATCH Melody queen Lata Mangeshkar awarded the nation’s highest civilian honour, Bharat Ratna in 2001
(ANI Archive) pic.twitter.com/khw3OZTMjG
— ANI (@ANI) February 6, 2022
Also Read: Prem Kumar: నీలాంబరి అంటూ వచ్చేసిన సంతోష్ శోభన్.. ప్రేమ్ కుమార్ కలల సుందరి ఎవరంటే..
Eesha Rebba: ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్?.. ఈషా నేచురల్ ఫొటోపై యంగ్ హీరోయిన్ నాటీ కామెంట్..