AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya: చెయ్యి కోసుకుంటానని హీరోను బెదిరించిన యువతి.. కార్తికేయ రియాక్షన్ ఏంటంటే..

డీజే టిల్లు ఫేమ్ నేహశెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ముందు నుంచి ఈ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నారు కార్తికేయ. నేహాశెట్టితో కలిసి ఇప్పటికే జనాల్లో కలిసి సరదాగా గడిపారు. ఈ చిత్రంలోని సాంగ్స్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతున్నారు కార్తికేయ.

Karthikeya: చెయ్యి కోసుకుంటానని హీరోను బెదిరించిన యువతి.. కార్తికేయ రియాక్షన్ ఏంటంటే..
Actor Kartikeya
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2023 | 4:37 PM

Share

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ నటించిన లేటేస్ట్ చిత్రం బెదురులంక 2012. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ వస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత కార్తికేయ నటించిన సినిమాలన్ని థియేటర్లలో డిజాస్టర్స్ అయ్యాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు వస్తున్నప్పటికీ సరైన హిట్టు మాత్రం పడలేదు. దీంతో బెదురులంక సినిమాపైనే కార్తికేయ ఆశలన్నీ ఉన్నాయి. డీజే టిల్లు ఫేమ్ నేహశెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ముందు నుంచి ఈ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నారు కార్తికేయ. నేహాశెట్టితో కలిసి ఇప్పటికే జనాల్లో కలిసి సరదాగా గడిపారు. ఈ చిత్రంలోని సాంగ్స్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతున్నారు కార్తికేయ.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పాలని ఓ నెటిజన్ అడగ్గా.. లక్కీ ఛార్మ్ అంటూ బదులిచ్చాడు. అలాగే చరణ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాలని మరో నెటిజన్ కోరగా.. మంచి స్కోప్ ఉన్న పాత్ర అయితే తప్పకుండా చేస్తానని అన్నారు. ఈ క్రమంలోనే ఓ లేడీ అభిమాని కార్తికేయను బెదిరించింది.

నువ్ నాకు రిప్లై ఇవ్వకపోతే చేయి కోసుకుంటాను అంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఇది చూసిన కార్తికేయ దెబ్బకు భయపడిపోయి వెంటనే రిప్లై ఇచ్చాడు. అమ్మో వద్దు వద్దు అంటూ రిప్లై ఇవ్వగా.. థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది సదరు యువతి. వీరిద్దరి మధ్య జరిగిన ఈ బ్లాక్ మెయిల్ సంభాషణ సరదాగానే జరిగినట్లు ఆ యువతి షేర్ చేసిన ఫోటో చూస్తే అర్థమవుతుంది.

View this post on Instagram

A post shared by Kartikeya (@actorkartikeya)

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన బెదురులంక 2012 చిత్రాన్ని నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించారు. ఆగస్ట్ 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబడుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1.7 కోట్లు గ్రాస్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వీకెండ్ కు మంచి రన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించగా.. కలర్ ఫోటో నిర్మాణ సంస్థ లౌక్య మూవీస్ నిర్మించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిరుద్యోగులకు శుభవార్త.. మరో DSCకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
నిరుద్యోగులకు శుభవార్త.. మరో DSCకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.
రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే జరిమానా పడుతుందా..?
రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే జరిమానా పడుతుందా..?
కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు