Samantha: కోర్టులో సమంతకు కొత్త ట్విస్ట్.. పిటిషన్ అత్యవసర విచారణకు అభ్యంతరం

కోర్టులో సమంతకు కొత్త ట్విస్ట్ ఎదురైంది. సమంత పిటిషన్‌ని అత్యవసరంగా విచారించేందుకు కోర్టు అభ్యంతరం తెలిపింది.

Samantha: కోర్టులో సమంతకు కొత్త ట్విస్ట్.. పిటిషన్ అత్యవసర విచారణకు అభ్యంతరం
Samantha
Follow us

|

Updated on: Oct 21, 2021 | 6:13 PM

Samantha Defamation Case: కోర్టులో సమంతకు కొత్త ట్విస్ట్ ఎదురైంది. సమంత పిటిషన్‌ని అత్యవసరంగా విచారించేందుకు కోర్టు అభ్యంతరం తెలిపింది.హై రెప్యుటేడ్ పర్సనాలిటీకి సంబంధించిన అంశం కావడంతో త్వరగా వినాలని సమంత లాయర్ బాలాజీ కోర్ట్ ను కోరారు. అయితే లాయర్‌పై కూకట్‌పల్లి కోర్టు ఆగ్రహంవ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కోర్ట్ ముందు అందరూ సమానులే అన్న న్యాయమూర్తి.. ప్రొసీజర్ ప్రకారమే వాదనలు వింటామని స్పష్టం చేశారు.

చైతూతో డైవోర్స్ తర్వాత సమంత ఫస్ట్ టైమ్‌ కోర్టు మెట్లెక్కింది. తనకు న్యాయం కావాలంటోంది. ఇంతకీ, సమంతకు జరిగిన అన్యాయమేంటి? ఆమె ఎలాంటి న్యాయం కోరుకుంటోంది? సామ్ మనోవేదనకు కారణమేంటి? 

‘తెలుగులో అత్యంత పాపులర్ నటిని… 45 సినిమాల్లో నటించా… 4 ఫిలిం ఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు, 6 సౌతిండియా అవార్డులు, 3 సినీ మా అవార్డులు అందుకున్నా… 12 మల్టీ నేషనల్‌ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా… తెలంగాణ ప్రభుత్వానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశా… స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా… ఇంత పాపులరైన నన్ను కొందరు టార్గెట్ చేశారు..’ ఇదీ సమంత ఆవేదన. ఇంతకీ, సమంతను ఎవరు? ఎందుకు టార్గెట్ చేశారు?

మేం విడిపోయామ్. మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు. లేనిపోని రూమర్లు సృష్టించొద్దు. సామ్‌ చైతూ విడిపోతూ చేసిన రిక్వెస్ట్ ఇది. కానీ, సమంత టార్గెట్‌ అయ్యింది. తప్పంతా సామ్‌దే. ఆమెకు తల్లి కావడం ఇష్టం లేదు. అబార్షన్ చేయించుకుంది. ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయ్. అందుకే చైతూ డైవోర్స్ ఇచ్చేశాడంటూ సమంతపై ట్రోల్స్‌ అటాక్ జరిగింది.

ఇంతకీ, సామ్ చైతూ ఎందుకు విడిపోయారో తెలుసా? ట్రోల్స్‌లో ఇదే మెయిన్ పాయింట్. ట్రోల్స్ శృతిమించడంతో సామ్ క్లారిటీ కూడా ఇచ్చింది. నాకెలాంటి ఎఫైర్స్ లేవ్. నేను అబార్షన్ చేయించుకోలేదు. తల్లి కావడానికి నేను ఒప్పుకోలేదన్న మాటల్లో నిజం లేదంటూ చెప్పుకుంది. అయినా, సామ్‌పై ట్రోల్స్ వార్ కంటిన్యూ అయ్యింది. ఇదే, ఆమె కోర్టు మెట్లెక్కడానికి కారణం.

సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న ట్రోల్స్‌పై సమంత కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. తనపై దుష్ప్రచారం చేసిన డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుతోపాటు య్యూట్యూబ్‌ ఛానళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేసింది.

పిటిషన్‌ ద్వారా సమంత తన ఆవేదనను కోర్టుకు చెప్పుకుంది. విడాకుల ప్రకటన తర్వాతే తనపై అసత్య ప్రచారం మొదలుపెట్టారు… నన్ను, నా క్యారెక్టర్‌ని కించపర్చారు… విడాకుల కోసం 300కోట్ల డీల్ కుదిరిందని తప్పుడు ప్రచారం చేశారు… నా డ్రెస్సింగ్‌పై వీడియోలు పెట్టి కించపర్చారు… అబార్షన్, అఫైర్స్ అంటూ తప్పుడు కథనాలు అల్లారంటూ తన ఆవేదనను కోర్టుకు చెప్పుకుంది సమంత.

ఇంతకీ, సమంత ఏం కోరుకుంటోంది?… తన పరువును బజారుకీడ్చిన యూట్యూబ్ ఛానెల్స్‌తో బహిరంగ క్షమాపణలు చెప్పించాలంటోంది సమంత. అలాగే, తనపై లేనిపోని ఎఫైర్లు అంటగట్టిన డాక్టర్ సీఎల్‌ వెంకట్రావుపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. ఆ యూట్యూబ్ ఛానెల్స్ నుంచి లింకులు డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సామ్‌ రిక్వెస్ట్ చేసింది. ఫైనల్‌గా మరోసారి దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సమంత కోరుతోంది.

Also Read..

Viral Video: నిర్లక్ష్యంగా నడిస్తే తప్పదు భారీ మూల్యం.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది..

Kidney Transplant: పంది కిడ్నీ మనిషికి.. ప్రపంచంలో తొలిసారిగా విజయవంతం అయిన ఆపరేషన్.. ఇది ఎలా చేశారంటే..