Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: ఆ డైరెక్టర్ వల్ల ఇబ్బంది పడ్డా.. ఫన్నీ విషయం చెప్పిన కృతి శెట్టి

తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. తన అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది కృతి. ఇక తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఉప్పెన సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో చేసింది.

Krithi Shetty: ఆ డైరెక్టర్ వల్ల ఇబ్బంది పడ్డా.. ఫన్నీ విషయం చెప్పిన కృతి శెట్టి
Krithi Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 04, 2023 | 8:49 AM

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ  సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మంగుళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. తన అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది కృతి. ఇక తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఉప్పెన సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో చేసింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి ఈ సినిమాలో రెచ్చిపోయి నటించింది. ఏకంగా లిప్ లాక్ తో అందరికి షాక్ ఇచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే నాగచైతన్య, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో చైతూతో జతకట్టింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఇలా వరుస విజయాలను అందుకొని స్టార్ గా మారిపోయింది.

అయితే ఆ తర్వాత ఈ అమ్మడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన వారియర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.  వెంటనే చేసిన మాచర్ల నియోజకవర్గం  బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. ఓ స్టార్ డైరెక్టర్ కారణంగా తాను ఇబ్బంది పడ్డాను అని తెలిపింది. కృతి రామ్ పోతినేని తో కలిసి వారియర్ అనే సినిమా చేసింది. అయితే ఈ సినిమాకు లింగు స్వామి దర్శకత్వం వహించారు. ఆయన తమిళ్ దర్శకుడు కావడంతో ఆయన తెలుగు భాషలో కొంచం తమిళ్ యాస కూడా మిక్స్ అయి ఉంటుంది. దాంతో కృతికి ఆయన తెలుగు అర్ధం కాలేదట. దాంతో ఆమె కాస్త ఇబ్బంది పడిందట. అయితే డైలాగ్స్ విషయంలో రామ్ హెల్ప్ చేశాడని తెలిపింది. ఆ తర్వాత ఆయన తెలుగును అర్ధం చేసుకుందట ఈ చిన్నది.

ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించడని మీకు తెలుసా..
ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించడని మీకు తెలుసా..
ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే.. గుండెకు కూడా ప్రమాదమట..
ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే.. గుండెకు కూడా ప్రమాదమట..
కసి తీర్చుకున్నారుగా.! దెబ్బకు దెబ్బ అంటే ఇదే కదా
కసి తీర్చుకున్నారుగా.! దెబ్బకు దెబ్బ అంటే ఇదే కదా
ఇండియన్ సినిమాల్లోనే అతిపెద్ద లిప్‌లాక్ ఇదేనట..
ఇండియన్ సినిమాల్లోనే అతిపెద్ద లిప్‌లాక్ ఇదేనట..
డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...