Gopichand Malineni : నిర్మాత పై ఫిర్యాదు చేసిన ‘క్రాక్’ దర్శకుడు.. కారణం ఏంటంటే..

మాస్ రాజా రవితేజ చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

Gopichand Malineni : నిర్మాత పై ఫిర్యాదు చేసిన 'క్రాక్' దర్శకుడు.. కారణం ఏంటంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 05, 2021 | 8:10 PM

Gopichand Malineni : మాస్ రాజా రవితేజ చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా పై మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు, దర్శకులు ప్రశంసలు కురిపించిన విషయం కూడా తెలిసిందే. ప్యాండమిక్ తర్వాత విడుదలై థియేటర్స్ లో సంచలన విజయం సాధించిన తొలి ఇండియన్ గా నిలిచింది క్రాక్.

ఈ క్రమంలో తాజాగా నిర్మాత ఠాగూర్ మధు మరో వివాదంలో చిక్కుకున్నారు. తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాత ఠాగూర్ మధు పై దర్శకుడు గోపీచంద్ మలినేని ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేసారని తెలుస్తుంది. తనకు రావాల్సిన  రెమ్యూనరేషన్ ఇప్పించవలసిందిగా అసోసియేషన్‌ ని కోరాడట గోపీచంద్. గోపీచంద్ మలినేని ఫిర్యాదు అందుకున్న డైరెక్టర్స్ అసోసియేషన్.. దీనిపై చర్యలు చేపడుతుందని తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. కాగా ఈ సినిమా విడుదల సమయంలో కూడా ఆర్థిక వ్యవహారాల కారణంగా మార్నింగ్, మ్యాట్నీ షోలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

2021 ఆస్కార్ బరిలో నిలిచిన బాలీవుడ్ లఘు చిత్రం.. ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎంపికైన ‘నట్కాట్’