Akhil Movie: అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!

టాలీవుడ్ రైటర్, దర్శకుడు కోన వెంకట్ అఖిల్ సినిమా గురించి వి.వి. వినాయక్‌కు ముందుగానే హెచ్చరించినట్లు వెల్లడించారు. సినిమా విజయంపై వినాయక్ నమ్మకం పెట్టుకున్నారని, అయితే అది గుడ్డి నమ్మకంగా మారిందని పేర్కొన్నారు. ఆ విషయాలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా..

Akhil Movie: అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
Kona Venkat

Updated on: Jan 18, 2026 | 1:53 PM

దర్శకుడు వి.వి. వినాయక్, హీరో అక్కినేని అఖిల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖిల్’ సినిమా రిజల్ట్‌పై రచయిత, దర్శకుడు కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖిల్ సినిమా కథను ఎంపిక చేసుకున్నప్పుడే తాను వినాయక్‌కు అడ్డుపడ్డానని, ఈ సినిమా చేయవద్దని ఎంతగానో ప్రయత్నించానని కోన వెంకట్ తెలిపారు. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే, కథ ఎంపికయ్యాకనే తాను వినాయక్‌కు వద్దని చెప్పానని కొన వెంకట్ అన్నారు. కేవలం తాను ఒక్కడినే కాకుండా, వినాయక్‌కు అత్యంత సన్నిహితులైన ఇతర దర్శకులు, స్నేహితుల ద్వారా కూడా ఈ కథ వద్దని చెప్పించానని పేర్కొన్నారు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

అయితే, వి.వి. వినాయక్ మాత్రం ఆ కథపై నమ్మకం పెట్టుకున్నారని కోన వెంకట్ వివరించారు. రెగ్యులర్ రొటీన్ సబ్జెక్టుల నుంచి ఇది కొత్తగా ఉంటుందని, విజయం సాధిస్తుందని ఆయన బలంగా నమ్మారని చెప్పారు. ‘ఒక హిట్‌కి కారణం ఒక నమ్మకం. ఒక ఫ్లాప్‌కి కారణం గుడ్డి నమ్మకం’ అని కోన వెంకట్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వినాయక్ కథను గుడ్డిగా నమ్మగా, తాను మాత్రం అది విజయం సాధించదని అంతకన్నా బలంగా నమ్మానని స్పష్టం చేశారు. సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. ఇక ‘పోస్ట్ మార్టం చేసి వేస్ట్ కదా’ అని అనుకున్నా.

ఇవి కూడా చదవండి

వి.వి. వినాయక్ తనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అత్యంత సన్నిహితుడని కోన వెంకట్ స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలను హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఉన్న అరుదైన దర్శకులలో వినాయక్ ఒకరని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల దాకా వినాయక్ విజయవంతంగా డైరెక్ట్ చేశారని తెలిపారు. ఇలాంటి ప్రతిభ ఉన్న దర్శకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. వినాయక్ త్వరలోనే ఒక మంచి స్క్రిప్ట్‌తో తిరిగి పుంజుకుంటారని, ఆయనకు ఆ స్టామినా ఉందని నమ్మకంతో తెలిపారు. వినాయక్ బౌన్స్ బ్యాక్ అవుతారని తాను పూర్తిగా నమ్ముతున్నట్టు కోన వెంకట్ పేర్కొన్నారు.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..