Viral Video: పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై మండిపడ్డ కోన వెంకట్, హరీశ్ శంకర్

|

Apr 20, 2024 | 5:52 PM

ఇప్పుడు అలాంటి వైరల్ వీడియోనే ఒకటి ఓ వర్గానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇందులో ఓ పెళ్లి వేడుకలో పురోహితుడిని దారుణంగా అవమానించారు. ఆయనతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ ఆట పట్టించారు. దీనిపై ఆగ్రహం చెందిన సదరు పెళ్లి పంతులు మండపం నుంచి వెళ్లిపోతాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

Viral Video: పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై మండిపడ్డ కోన వెంకట్, హరీశ్ శంకర్
Kona Venkat, Harish Shankar
Follow us on

సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. వీటిలో నిజమెంత? అన్నది తెలుసుకోకుండా కొందరు వీటిని షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా కొన్ని కులాలను, మతాలను టార్గెట్ చేస్తూ షేర్ అయ్యే వీడియోలు ఆయా వర్గాల వారి మనోభావాలను దెబ్బతీస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వైరల్ వీడియోనే ఒకటి ఓ వర్గానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇందులో ఓ పెళ్లి వేడుకలో పురోహితుడిని దారుణంగా అవమానించారు. ఆయనతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ ఆట పట్టించారు. దీనిపై ఆగ్రహం చెందిన సదరు పెళ్లి పంతులు మండపం నుంచి వెళ్లిపోతాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

గౌరవించకపోయినా పర్లేదు.. కానీ..

బీజేపీ ప్రముఖ నాయకురాలు యామినీ శర్మ ఈ వీడియోపై రియాక్ట్ అయ్యారు. ‘పురోహితుడిని ఇంత దారుణంగా అవమానించడం దారుణం. కేవలం బ్రాహ్మణులే కాదు సమాజంలోని ప్రతీ హిందువూ దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు జరిగిందో నాకు తెలియదు కానీ ఎలాంటి సందర్భం అయినా ఇలా చేయడం మహా పాపం’ అని రాసుకొచ్చారు యామీనీ శర్మ. ఇక రచయిత కోన వెంకట్ కూడా ఈ వీడియోపై ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ‘ఇది అత్యంత హేయనీయం.. ఖండనీయం..అన్ని కులాలను , మతాలను సమాన దృష్టితో చూడడంలో బ్రాహ్మణులు ముందుంటారు.. వారిని గౌరవించక పోయినా పర్వాలేదు.. అవమానించకండి’ అని ట్వీట్ చేశాడు కోన. దీనికి చేతులు చేతుల జోడించి దండం పెట్టిన ఎమోజీని జత చేశాడు.

ఇవి కూడా చదవండి

హరీశ్ శంకర్ రియాక్షన్..

ఇదే వీడియోపై స్పందించిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘ఇదం బ్రాహ్మం.. ఇదం క్షాత్రం
శాపాదపి శరాదపి’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది. అసలు ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది? అసలు మ్యాటర్ ఏంటి? ఎందుకు అలా జరిగింది? అనే విషయాలు మాత్రం తెలియరావడం లేదు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.