Kalki 2898 AD: కల్కి సినిమాలో కృష్ణుడి పాత్ర చేసింది అతడే.. ఆ యంగ్ హీరో బ్యాగ్రౌండ్ ఇదే..

ఇన్నాళ్లు అమితాబ్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటానీ, శోభన, మాళవిక నాయర్ కీలకపాత్రలో పోషించగా.. నిన్న విడుదలైన సినిమాలో ఊహించని అతిథి పాత్రలలో మరికొందరు స్టార్స్ సర్ ప్రైజ్ చేశారు. డైరెక్టర్ రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, అనుదీప్ కెవి, ఫరియా అబ్దుల్లా వంటి తారలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Kalki 2898 AD: కల్కి సినిమాలో కృష్ణుడి పాత్ర చేసింది అతడే.. ఆ యంగ్ హీరో బ్యాగ్రౌండ్ ఇదే..
Krishna Kumar
Follow us

|

Updated on: Jun 28, 2024 | 9:37 AM

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్‏గా ఈ మూవీ థియేటర్లలో సెన్సెషన్ సృష్టిస్తుంది. ప్రీమియర్ షోస్ నుంచే ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుని విజయవంతంగా దూసుకెళ్తుంది. డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్, వీఎఫ్ఎక్స్, ప్రభాస్, అమితాబ్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. హాలీవుడ్ రేంజ్‏లో రూపొందించిన ఈ ఇండియన్ మూవీని డైరెక్టర్ నాగ్ అశ్విన్ మేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్విస్టులు, పాత్రలకు ఇచ్చిన ఎలివేషన్స్, స్టార్ నటీనటులు, డైరెక్టర్స్ గెస్ట్ అప్పీరియన్స్, డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చూసి అడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇన్నాళ్లు అమితాబ్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటానీ, శోభన, మాళవిక నాయర్ కీలకపాత్రలో పోషించగా.. నిన్న విడుదలైన సినిమాలో ఊహించని అతిథి పాత్రలలో మరికొందరు స్టార్స్ సర్ ప్రైజ్ చేశారు. డైరెక్టర్ రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, అనుదీప్ కెవి, ఫరియా అబ్దుల్లా వంటి తారలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

అయితే ఈ సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్రభాస్ కు ఇచ్చిన ఎలివేషన్ వేరేలెవల్లో ఉంది. అయితే ఇప్పుడు కల్కి సినిమాలో ఒకే ఒక్క పాత్రపై సస్పెన్స్ నెలకొంది. అదే కృష్ణుడి పాత్ర. ఇందులో కన్నయ్యగా కనిపించింది ఎవరా అని నెట్టింట సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా ఆ పాత్ర ఎవరు చేశారనే విషయంపై మాత్రం క్లారిటీ వచ్చేసింది. కల్కి సినిమాలో కృష్ణుడిగా కనిపించింది తానే అంటూ కోలీవుడ్ యంగ్ హీరో కృష్ణ కుమార్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ఇంత గొప్ప క్యారెక్టర్ తనకు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని.. తన పాత్రకు సెలబ్రెటీస్ ఇచ్చిన ప్రశంసలను పోస్ట్ చేస్తూ కృష్ణుడి పాత్రపై క్లారిటీ ఇచ్చేశారు.

కల్కిలో కృష్ణుడిగా నటించిన కృష్ణకుమార్ తమిళంలో మంచి పాపులారిటీ ఉన్న నటుడు. తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా అతడు సుపరిచితమే. హీరో సూర్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సూరారై పొట్రు తెలుగులో ఆకాషమే నీ హద్దురా పేరుతో డబ్ అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సూర్యకు స్నేహితుడిగా కనిపించారు కృష్ణ కుమార్. అలాగే ధనుష్ హీరోగా నటించిన మారన్ మూవీలోనూ కీలకపాత్ర పోషించారు. అయితే కల్కి సినిమాలో కృష్ణుడిగా కనిపించిన కృష్ణ కుమార్ ఫేస్ చూపించకుండా తన బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా నటించారు. ఇక ఇందులో కృష్ణుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది కోలీవుడ్ యాక్టర్ అర్జున్ దాస్. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. అర్జున్ దాస్ విక్రమ్ సినిమాలో సూర్య అలియాస్ రోలెక్స్ పాత్రకు డబ్బింగ్ చెప్పి చాలా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఓజీ చిత్రంలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
వలకు చిక్కిన వింత చేప.. లబోదిబోమంటున్న మత్స్యకారులు..!
వలకు చిక్కిన వింత చేప.. లబోదిబోమంటున్న మత్స్యకారులు..!
ఆ క్యాచ్‌‌పై డౌట్.. సౌతాఫ్రికా ఫ్యాన్స్ రచ్చ.. అసలు మ్యాటర్ ఇదే..
ఆ క్యాచ్‌‌పై డౌట్.. సౌతాఫ్రికా ఫ్యాన్స్ రచ్చ.. అసలు మ్యాటర్ ఇదే..
కల్కి రికార్డుల మోత.. పాన్ వరల్డ్ లో సత్తా చూపిస్తున్న మూవీ..
కల్కి రికార్డుల మోత.. పాన్ వరల్డ్ లో సత్తా చూపిస్తున్న మూవీ..
పుంగనూరులో పొలిటికల్ టెన్షన్.. ఎంపీ మిథున్‌రెడ్డి హౌజ్ అరెస్ట్..
పుంగనూరులో పొలిటికల్ టెన్షన్.. ఎంపీ మిథున్‌రెడ్డి హౌజ్ అరెస్ట్..
కల్కి రికార్డ్స్ ను బ్రేక్ చేసేది ఎవరు.. ఈ సినిమాలకు ఆ సత్తా ఉందా
కల్కి రికార్డ్స్ ను బ్రేక్ చేసేది ఎవరు.. ఈ సినిమాలకు ఆ సత్తా ఉందా
కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ కలెక్షన్స్..
కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ కలెక్షన్స్..
ఇదేం చేపరా సామీ.. చిరుత కంటే స్పీడ్‌గా ఉంది..! గాల్లో ఎగురుతూ వేట
ఇదేం చేపరా సామీ.. చిరుత కంటే స్పీడ్‌గా ఉంది..! గాల్లో ఎగురుతూ వేట
ఐకానిక్ మూమెంట్‌తో ట్రోఫీ ఎత్తిన రోహిత్.. వీడియో చేస్తే నవ్వులే
ఐకానిక్ మూమెంట్‌తో ట్రోఫీ ఎత్తిన రోహిత్.. వీడియో చేస్తే నవ్వులే
అజిత్ విశ్వాసం మూవీలో జగపతి బాబు కూతురు గుర్తుందా.. ?
అజిత్ విశ్వాసం మూవీలో జగపతి బాబు కూతురు గుర్తుందా.. ?
'మన్ కీ బాత్'ద్వారా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
'మన్ కీ బాత్'ద్వారా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి