Vishal: విశాల్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన హీరో.. అసలేం జరిగిందంటే..
గత కొన్ని రోజులుగా కోలీవుడ్ హీరో విశాల్ కు సంబంధించిన వీడియోస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మదగజరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న విశాల్ ను చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. ఇన్నాళ్లు బాహుబలి కటౌట్ తో ఎంతో ఆరోగ్యంగా కనిపించిన విశాల్ కు ఏం జరిగిందంటూ ఆందోళనకు గురయ్యారు.
కోలీవుడ్ హీరో విశాల్ ఆరోగ్యం గురించి కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశాల్ వణుకుతూ..పూర్తిగా బక్కిచిక్కిపోయి కనిపించాడు. మాట్లాడేందుకు ఇబ్బందిపడుతూ.. సరిగ్గా చూడలేకపోయాడు. దీంతో విశాల్ ఆరోగ్య పరిస్థితిని చూసి ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. ఇదివరకే విశాల్ ఆరోగ్య పరిస్థితి పై నటి ఖుష్బూ స్పందించిన సంగతి తెలిసిందే. విశాల్ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారని ఆమె వెల్లడించింది. తాజాగా హీరో జయం రవి స్పందించారు. తన తదుపరి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యం గురించి మాట్లాడారు.
విశాల్ త్వరలోనే తిరిగి వస్తారని అన్నారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. “విశాల్ మంచి మనసు ఉన్న వ్యక్తి. ఎంతోమందికి సేవ చేశారు. ప్రస్తుతం అతడికి గడ్డుకాలం నడుస్తోంది. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు. సింహంలా గర్జిస్తారు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక విశాల్ ఆరోగ్యం గురించి అతడి మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వైరల్ ఫీవర్, తీవ్రమైన నొప్పులతో ఆయన ఇబ్బందిపడుతున్నారని.. వైద్యులు ఆయనకు విశ్రాంతి సూచించారని తెలిపారు. అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన ఆరోజు ఈవెంట్ కు హాజరయ్యారని… సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రిక్వెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. విశాల్ హీరోగా డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించిన సినిమా మదగజరాజు. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల తర్వాత విడుదలవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం చెన్నైలో జరిగిన ఈ మూవీ వేడుకలో పాల్గొన్నారు విశాల్. సినిమా గురించి విశాల్ మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణుకుతూ కనిపించాయి. నడవడానికి, చూడడానికి, మాట్లాడేందుకు సైతం ఇబ్బందిపడ్డారు.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.