Tollywood: వార్నీ.. అభిమానులకు షాకిచ్చిన హీరో.. స్టైలీష్ లుక్‏లో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్..

|

Oct 07, 2024 | 4:55 PM

సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్.. అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రెటీ. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో.. సినిమా ప్రమోషన్లలో మాత్రం అస్సలు పాల్గొనడు. అంతేకాదు.. సోషల్ మీడియా ఖాతాలు లేవు.. అభిమానులతో మీటింగ్స్ కూడా లేవు. అయినా కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు.

Tollywood: వార్నీ.. అభిమానులకు షాకిచ్చిన హీరో.. స్టైలీష్ లుక్‏లో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్..
Ajith
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో లేటేస్ట్ లుక్ ఫోటో తెగ వైరలవుతుంది. ఇన్నాళ్లు ఎంతో సింపుల్ గా కనిపించిన ఆ స్టార్.. ఇప్పుడు స్టైలీష్ లుక్‏లో అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్.. అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రెటీ. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో.. సినిమా ప్రమోషన్లలో మాత్రం అస్సలు పాల్గొనడు. అంతేకాదు.. సోషల్ మీడియా ఖాతాలు లేవు.. అభిమానులతో మీటింగ్స్ కూడా లేవు. అయినా కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. పైన ఫోటోను చూశారు కదా.. ఎవరో గుర్తుపట్టరా.. ?. అతడే కోలీవుడ్ హీరో అజిత్. తాజాగా ఈ హీరో కొత్త లుక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

తునీవు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజిత్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా విదాముయార్చి. డైరెక్టర్ మిజిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో త్రిష, అర్జున్, రెజీనా, ఆరవ్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవలే అజర్‌బైజాన్‌లో షూటింగ్ పూర్తికాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇటు విదాముయార్చి మూవీ విడుదలకు రెడీ అవుతుండగా.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అజిత్. తన 63వ చిత్రానికి మార్క్ ఆంటోని మూవీ ఫేమ్ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలై అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత నెలలో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా మొదటి దశ షూటింగ్‌ ఇటీవలే ఒక నెల పూర్తయింది.

ఇవి కూడా చదవండి

తాజాగా ఈ సినిమాలో అజిత్ కుమార్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో మెప్పించాడు. ప్రస్తుతం ఈ మూవీలోని అజిత్ లుక్ నెట్టింట వైరలవుతుండగా.. తమ అభిమాన హీరోను ఇలా చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అజిత్ కుమార్ బరువు తగ్గాడు. అలాగే ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అజిత్ న్యూలుక్ ఫోటోస్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.