AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara Box office Collections: బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ సంచలనం.. పది రోజుల్లో ఎన్ని కోట్లంటే..

ఇక జాన్వీ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. విడుదలైన ఫస్ట్ డే నుంచి ఈ సినిమాకు ఓ రేంజ్ రెస్పాన్స్ రాగా.. అటు థియేటర్లలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది ఈ సినిమా. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు పది రోజుల్లోనూ వసూళ్ల సునామి సృష్టిస్తుంది.

Devara Box office Collections: బాక్సాఫీస్ వద్ద 'దేవర' సంచలనం.. పది రోజుల్లో ఎన్ని కోట్లంటే..
Devara Movie
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2024 | 4:42 PM

Share

‘దేవర’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టి్స్తోన్న సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషించగా.. అనిరుధ్ రవిచంద్రన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో ద్విపాత్రాభినయంలో తారక్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు. ఇక జాన్వీ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. విడుదలైన ఫస్ట్ డే నుంచి ఈ సినిమాకు ఓ రేంజ్ రెస్పాన్స్ రాగా.. అటు థియేటర్లలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది ఈ సినిమా. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు పది రోజుల్లోనూ వసూళ్ల సునామి సృష్టిస్తుంది.

దేవర మూవీ విడుదలై పది రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్స్ లో తగ్గేదేలే అంటోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అవుతుంది. కేవలం పది రోజుల్లోనే రూ.466 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని ఓ కొత్త పోస్టర్ ద్వారా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక దసరా పండగకు ముందు బాక్సాఫీస్ వద్ద హావా చూపిస్తున్న దేవర.. ఇటు పండగ నాటికి రూ.500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడం ఖాయంగా తెలుస్తోంది. ప్రస్తుతం దసరా సెలవులు కొనసాగుతుండడం.. ఇటు పండక్కి మరో భారీ బడ్జెట్ మూవీ లేకపోవడం కూడా దేవరకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలు సత్తా చాటుతున్న దేవర ఫస్ట్ పార్ట్. మరికొన్ని రోజుల్లోనే సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 2 ఇంకా బాగుంటుందని.. ఇప్పటికే మేజర్ సీన్ షాట్స్ కూడా పూర్తైందన్నారు ఎన్టీఆర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి