Cinema : బాక్సాఫీస్‌నే భయపెట్టిన సినిమా ఇది.. రూ.40 కోట్ల తీస్తే రూ.350 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు ఇండస్ట్రీ షేక్..
స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. టాప్ డైరెక్టర్ కాదు.. కానీ ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్‌నే భయపెట్టింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రికార్డ్స్ తిరగరాసింది. పాన్ ఇండియా లెవల్లో రూ.350 కోట్ల కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరెంటీ.. ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందామా.

ఇటీవల కాలంలో సినిమా బడ్జెట్ కోట్లలో ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోహీరోయిన్స్ నటించే చిత్రాలను కోట్లాది రూపాయాల పెట్టుబడులతో నిర్మిస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు హిట్ కాగా.. మరికొన్ని మాత్రం నిర్మాతలకు నష్టాలను మిగులుస్తున్నాయి. అలాగే ఎలాంటి అంచనాలు, హై బడ్జెట్ లేని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం థియేటర్లలో సరికొత్త చరిత్ర సృష్టించింది. గతేడాది రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా రూ. 350 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా పేరు హను మాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని, వినయ్ తదితరులు నటించారు.
ఇవి కూడా చదవండి : Mogalirekulu : ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. మొగలి రేకులు సీరియల్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..
ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించగా.. రూ.40 కోట్ల బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. గతేడాది సంక్రాంతి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా లెవల్లో దాదాపు రూ.350 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. భక్తి, ఫాంటసీ కలగలిసిన సినిమాకు అడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తేజా సజ్జా యాక్టింగ్, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ5, హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : ఇవి కూడా చదవండి : Actress : అతడిని నమ్మి ఆ సీన్స్ చేశాను.. కానీ షూట్‌లో.. హీరోయిన్ కామెంట్స్..
సినిమా కథ విషయానికి వస్తే.. హనుమంత్ (తేజ సజ్జా) ఒక మాయా రాయి నుండి శక్తిని పొంది సూపర్‌మ్యాన్ అవుతాడు. అతను ఆ శక్తిని తాను నివసించే గ్రామానికి ఉపయోగపడేలా చేస్తారు. మరోవైపు చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్ కావాలనుకునే మైఖేల్ (వినయ్), హనుమంత్ వద్ద ఉన్న మాయ రాయిని తీసుకోవడానికి పథకం వేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది కథ. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..
ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..
ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?




