Suriya : సూర్యతో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఏకంగా పెద్ద హీరోలతోనే సినిమాలు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో సూర్యకు సంబంధించిన ఓ పాత ఫోటో ఇప్పుడు తెగ వైరలవుతుంది. అప్పట్లో సూర్య ముందు నిలబడిన ఓ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?

పైన ఫోటోలో సూర్య ముందు నిలబడిన చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.. మలయాళీ ముద్దుగుమ్మ రవీనా రవి. సురేష్ సంగయ్య దర్శకత్వంలో, విదార్థ్ కథానాయకుడిగా నటించిన ‘ఒరు కిడైయిన్ కరుణై మను’ చిత్రం 2017లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతోనే ఆమె వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. అంతకు ముందు పలు యాడ్స్ చేసింది. కేరళకు చెందిన నటి రవీనా రవి చెన్నైలోని ఎతిరాజ్ కాలేజీలో చదువుకున్నారు. ఆమె 2020లో వచ్చిన ‘కవల్తురై ఉత్తి నన్బన్’ చిత్రంలో నటించింది. 2021లో వసంత్ రవి నటించిన ‘రాకీ’ చిత్రంలో ఆమె నటించింది. ఆమె ‘వీరమే వాగై సూదుమ్’ చిత్రంలో విశాల్ సరసన నటించింది. ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన 2022 చిత్రం ‘లవ్ టుడే’లో ఆమె యోగి బాబు భార్య పాత్రను పోషించింది. తెరపై తక్కువ సమయం కనిపించినప్పటికీ, రవీనా రవి తన శక్తివంతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ‘మామన్నన్’ సినిమాలో ఫహద్ ఫాసిల్ భార్యగా రవీనా రవి నటించారు. చిన్న పాత్రే అయినా పెద్దగా ప్రభావం చూపింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ అమ్మడు.. మరోవైపు నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
తాజాగా సూర్యతో ఉన్న చిన్ననాటి ఫోటోను నెట్టింట పంచుకుంటూ “సూర్య సర్, నేను ఇది చెప్పాలి. మీరు చాలా అందంగా ఉన్నారు! ‘కాక్క కాక్క’ సినిమా తర్వాత సెట్స్‌లో సూర్యను కలవడం చాలా ఆనందంగా ఉంది. చాలా వినయశీలి, మంచి మనసున్న స్టార్. మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు సర్. ఈ అందమైన చిత్రంలో మా అమ్మ కూడా భాగమైనందుకు నాకు సంతోషంగా ఉంది. విశ్వనాథన్ , కుమారులకు శుభాకాంక్షలు.” అంటూ రాసుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..
రవీనా రవి..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..
