Actress: 13 ఏళ్లలో ఒక్క హిట్టు లేదు.. అయినా ఆస్తులు రూ.4600 కోట్లు.. ఈ హీరోయిన్ రేంజ్ మాములుగా లేదుగా..

13 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరోయిన్. కానీ హురున్ రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం ఆమె భారతదేశంలోనే అత్యంత ధనిక నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అవును... ఆమె ఆస్తులు ఏకంగా రూ.4600 కోట్లు. అంతేకాదు.. ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన అందాల అప్సరస ఆమె. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress: 13 ఏళ్లలో ఒక్క హిట్టు లేదు.. అయినా ఆస్తులు రూ.4600 కోట్లు.. ఈ హీరోయిన్ రేంజ్ మాములుగా లేదుగా..
Juhi Chawla

Updated on: Jul 21, 2025 | 7:47 AM

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించింది. అగ్ర హీరోలకు జోడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చూడచక్కని రూపం… అద్భుతమైన నటనతో వెండితెరపై మ్యాజిక్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా… ? 13 సంవత్సరాలుగా సినీరంగానికి దూరంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆమె అత్యంత ధనిక నటీమణులలో అగ్రస్థానంలో ఉంది. దశబ్దాలుగా ఒక్కహిట్టు లేకపోయినా.. ఆమె ఆస్తులు మాత్రం రూ.4600 కోట్లు. ఆమె మరెవరో కాదండి.. జూహీ చావ్లా. 2024లో విడుదలైన ‘హురున్ రిచ్ లిస్ట్ 2024’ నివేదిక ప్రకారం ఆమె భారతదేశంలో అత్యంత ధనిక నటి. జూహీ చావ్లా.. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.

సినిమాల్లో ఆమెకు తక్కువగానే పారితోషికం వచ్చిందని సమాచారం. కానీ ఆమె వ్యాపారరంగంలో సక్సెస్ అయ్యింది. రియల్ ఎస్టేట్, క్రికెట్ జట్టులో పెట్టుబడి పెట్టారు. షారుఖ్ ఖాన్ తో కలిసి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో పెట్టుబడి పెట్టారు. జూహి చావ్లా రూ. 623 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఫోర్బ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మొత్తం విలువ రూ.9,139 కోట్లు. షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ నిర్మాణ సంస్థలో జూహి చావ్లా కూడా సహ భాగస్వామి. సౌరాష్ట్ర సిమెంట్‌లో చావ్లాకు 0.07 శాతం వాటా కూడా ఉంది. అలాగే ఆమెకు ముంబైలో రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. ఆమెకు ముంబైలో ఒక పెద్ద బంగ్లా ఉంది. గుజరాత్‌లో కూడా ఒక పెద్ద బంగ్లా ఉంది.

ఇవి కూడా చదవండి

జూహీ చావ్లా వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటి వివరాల విషయానికి వస్తే.. ఆస్టన్ మార్టిన్ రాపిడ్ (రూ. 3.3 కోట్లు), BMW 7-సిరీస్ (రూ. 1.8 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ (రూ. 1.7 కోట్లు), జాగ్వార్ XJ (రూ. 1.2 కోట్లు), పోర్స్చే కయెన్ (రూ. 1.36–2 కోట్లు) వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. 1986లో సినీప్రయాణం స్టార్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..