Actress : ప్రియురాలితో అడ్డంగా దొరికిపోయిన భర్త.. విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి.. ఇప్పుడు దిమ్మతిరిగే క్రేజ్..
సినీ పరిశ్రమలో ఎన్నో కలలో అడుగుపెడుతుంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంటారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తమ తోటి నటులను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుంటారు. కానీ అందరి జీవితాలు అంత సాఫీగా సాగలేవు. విడాకుల తర్వాత తిరిగి కెరీర్ ప్రారంభించిన తార గురించి మీకు తెలుసా..

సినీరంగంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తక్కువ సమయంలోనే ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన తోటి నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఆ తర్వాత ప్రియురాలితో భర్త అడ్డంగా దొరికిపోవడంతో విడాకులు తీసుకుంది. తిరిగి ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఆమె ఇప్పుడు టీవీ పరిశ్రమలో చక్రం తిప్పుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే జెన్నిఫర్ వింగెట్. హిందీ సినిమా ప్రపంచంలో క్రేజీ బ్యూటీ. ముఖ్యంగా బుల్లితెరపై అత్యంత డిమాండ్ ఉన్న సీరియల్ హీరోయిన్. జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, నటి ఎప్పుడూ వదులుకోలేదు. ప్రస్తుతం ఆమె స్మాల్ స్క్రీన్ పై లేడీ సూపర్ స్టార్. అనేక సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. అనేక సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించడం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
జెన్నిఫర్ తన కెరీర్‌లో ‘దిల్ మిల్ గయే’, ‘బెహద్’, ‘కహిన్ తో హోగా’ వంటి అనేక సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తెరపై రాణిగా కొనసాగుతున్న జెన్నిఫర్ జీవితంలో విఫలమైంది. జెన్నిఫర్ వింగెట్ చిన్న వయసులోనే కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరూ మొదట ఒక టీవీ షోలో కలిశారు. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. దీంతో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. జెన్నిఫర్ తో వివాహం జరిగిన కొంతకాలానికే ఆమె భర్త తన ప్రియురాలితో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అందరి ముందు అతడిని చెంపదెబ్బ కొట్టింది జెన్నిఫర్.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
తన తనను మోసం చేశాడని కొన్నాళ్లు బాధపడిన జెన్నిఫర్.. పెళ్లైన 10 నెలల తర్వాత అతనితో రాజీపడలేక విడాకులు తీసుకుంది. కానీ జెన్నిఫర్ భర్త కరణ్ సింగ్ గ్రోవర్ ఇప్పటివరకు మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న జెన్నిఫర్.. ఇప్పుడు సీరియల్స్ , రియాల్టీ షోలు చేస్తూ బిజీగా ఉంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..




