
సినీరంగంలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంది. అనేక కష్టాలను, అవమానాలను భరించి ఇండస్ట్రీలో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు సైతం ఉన్నారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే చిన్న పొరపాటుతో సినిమాలకు దూరమయ్యింది ఓ ముద్దుగుమ్మ. తెలుగు, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలోనే అనుకోకుండా సినిమాలకు దూరమయ్యింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఊర్మిళా మటోండ్కర్. 1990లలో తన అందం, అభినయంతో ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్. ఒకప్పుడు ఆమె నిర్మాతల మొదటి ఎంపిక. ఆమెకు సూపర్ స్టార్ల కంటే ఎక్కువ పారితోషికం లభించింది. కానీ వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఒక నిర్ణయం ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి.
‘మాసూమ్’ సినిమాలో బాలనటిగా అరంగేట్రం చేసిన ఊర్మిళ, ఆ తర్వాత ‘రంగీలా’, ‘భూత్’, ‘సత్య’, ‘జంగల్’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘రంగీలా’ చిత్రం ఆమెను సూపర్ స్టార్ ని చేసింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మరిన్ని సినిమాలు వచ్చాయి. అయితే వరుస ఆఫర్స్ అందుకుంటున్న సమయంలోనే ఈ బ్యూటీ గురించి కొన్ని వార్తలు వినిపించాయి.
ఆమె పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని ప్రచారం జరిగింది.దీంతో ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం పడింది. అదే సమయంలో ఊర్మిళకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఊర్మిళ కెరీర్ ప్రభావితం కావడం ప్రారంభమైంది. సినిమా పరిశ్రమ నుండి రిటైర్ అయిన తర్వాత ఊర్మిళ మార్చి 3, 2016న కాశ్మీరీ మోడల్, నటుడు మొహ్సిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకుంది. వారిద్దరి మధ్య పదేళ్ల వయసు వ్యత్యాసం ఉంది. మోసిన్ ‘లక్ బై ఛాన్స్’ , ‘ముంబై మస్త్ కలందర్’ వంటి చిత్రాలలో పనిచేశారు.
అయితే గతేడాది వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం నడిచింది. కొన్ని నివేదికల ప్రకారం, ఊర్మిళ విడాకులకు దరఖాస్తు చేసుకుందని టాక్ నడిచింది. అదే సమయంలో ఆమె సోషల్ మీడియాలో మొహ్సిన్‌ను అన్‌ఫాలో చేసింది. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే విడాకుల గురించి వీరిద్దరు స్పందించలేదు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన