అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్.. దెబ్బకు 1000 కోట్ల కలెక్షన్స్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన తారలు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారారు. కొందర్ సక్సెస్ కాగా.. మరికొందరు మాత్రం సినిమాలకు దూరంగా విదేశాల్లో చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ చైల్డ్ ఆర్టిస్టు్ మాత్రం కథానాయికగా ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె నటించిన సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది.

ఒకప్పుడు సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో అనేక సినిమాల్లో కనిపించిన ఆమె.. అటు తెలుగులోనూ పాపులర్ అయ్యింది. అయితే అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఆమె.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది. కథానాయికగా తొలి సినిమాతోనే సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆమె నటించిన సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు సారా అర్జున్. తమిళంలో పాపులర్ బాలనటి. దేవతిరుంగళ్ సినిమాతో తమిళంలోకి బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించింది. కానీ విక్రమ్ నటించిన నాన్న సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
నాన్న సినిమాలో సారా అర్జున్, విక్రమ్ బాండింగ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇందులో సారా క్యూట్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాల్లో సైలెంట్ అయిన సారా.. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఐశ్వర్య రాయ్ టీనేజ్ అమ్మాయి పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత సారా కథానాయికగా మారింది. ఇప్పుడుూ ఆమె ఎక్కువగా హిందీ సినిమాలపై ఫోకస్ చేసింది. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ధురంధర్.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి సరికొత్త రికార్డ్ బ్రేక్ చేసింది. దీంతో కథానాయికగా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది సారా. ఇదెలా ఉంటే.. ఈ బ్యూటీ తండ్రి సైతం పాపులర్ నటుడు. అతడు తెలుగులో డియర్ కామ్రేడ్ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
