
సినీరంగంలో కొన్ని సినిమాలు విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తాయి. కానీ రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్స్ అవుతుంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా హైప్ మధ్య విడుదలై ప్లాప్ అయిన సినిమాలు బోలేడు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేసిన చిత్రాలు ప్రేక్షకులను నిరాశకు గురిచేశాయి. అలాంటి జాబితాలో ఈ సినిమా ఒకటి. దాదాపు రూ. 85 కోట్లతో నిర్మించిన ఈ సినిమా కేవలం రూ.9 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..? ఆ మూవీ మరేదో కాదు.. అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ. ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.
ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. తన లుక్ పూర్తిగా మార్చేశాడు. ఇన్నాళ్లు క్యూట్, లవర్ బాయ్ లా కనిపించిన ఈ హీరో.. ఈ సినిమా కోసం యాక్షన్ హీరోగా.. ఫుల్ మాస్ లుక్ లోకి మారిపోయాడు. అలాగే ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నాడు. ఈ మూవీ నుంచి అఖిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమాతో అఖిల్ స్టార్ హీరో అయిపోతాడని అనుకున్నారు. కానీ అలా కాకుండా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాడు అఖిల్. ఇందులో మమ్ముట్టి కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. దాదాపు 85 కోట్లు బడ్జెట్.. ప్రమోషన్స్ కోసం మరో 5 కోట్లు.. ఇలా మొత్తం రూ.90 కోట్లు వెచ్చించగా.. కేవలం రూ.9 కోట్లు మాత్రమే రాబట్టంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..