Mahesh Babu: మహేష్ ఒక్క బ్యాగ్.. లైఫ్ సెట్టు.. ఆ లూయిస్ విట్టన్ బ్యాగ్ ధర తెలిస్తే షాకే…

చాలా కాలం తర్వాత ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లాడు మహేష్. ఇటీవల మహేష్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ నెట్టింట వైరలయ్యాయి. వెకేషన్ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ రానున్నారు మహేష్. ఇదిలా ఉంటే.. మహేష్ ఫ్యాషన్ స్టైల్ గురించి నిత్యం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది.

Mahesh Babu: మహేష్ ఒక్క బ్యాగ్.. లైఫ్ సెట్టు.. ఆ లూయిస్ విట్టన్ బ్యాగ్ ధర తెలిస్తే షాకే...
Mahesh Babu
Follow us

|

Updated on: Jun 23, 2024 | 9:44 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో వర్క్ చేయనున్నట్లు గతంలోనే తెలిపారు. ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ పై తెరకెక్కించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మహేష్. అలాగే లాంగ్ హెయిర్ తో పూర్తిగా హాలీవుడ్ రేంజ్ లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లాడు మహేష్. ఇటీవల మహేష్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ నెట్టింట వైరలయ్యాయి. వెకేషన్ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ రానున్నారు మహేష్. ఇదిలా ఉంటే.. మహేష్ ఫ్యాషన్ స్టైల్ గురించి నిత్యం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది.

సూపర్ స్టార్ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ఎంపికలపై ఆసక్తి చూపిస్తుంటారు నెటిజన్స్. ఎప్పుడూ క్యాజువల్ అండ్ స్టైలీష్ లుక్ లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు మహేష్. మహేష్ షూస్ నుంచి డ్రెస్సింగ్, గ్లాసెస్, వాచ్ ఇలా ప్రతిదీ ఎంతో స్టైలీష్ గ్రాండ్ గా కనిపిస్తుంది. గతంలో వెకేషన్ కు వెళ్తూ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎంఎం బ్యాగ్ ధరించాడు. ఆ సొగసైన నలుపు, నీలం రంగు బ్యాగ్ సిగ్నేచర్ LV మోగ్రామ్ తో అలకరించబడింది. ఈ బ్యాగ్ హై ఎండ్ ఫ్యాషన్ లుక్. అయితే సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ డీకోడ్ ఇన్ స్టా పేజీ ప్రకారం ఆ లూయిస్ విట్టా బ్యాగ్ ధర అక్షరాల రూ.3.92 లక్షలు. ఇప్పుడు ఈ బ్యాగ్ ధర తెలిసి షాకవుతున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించబోయే సినిమా ఆస్ట్రేలియా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంటుంది. ఇందులో మహేష్ సరసన హాలీవుడ్ ముద్దుగుమ్మలు నటిస్తారని ముందుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత జాన్వీ కపూర్, అలియా భట్ పేర్లు వినిపించాయి. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్