
మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు 292 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరూ సూపర్ స్టార్స్ కాంబోలో రావాల్సిన ఓ సినిమా మిస్సైందట. కట్ చేస్తే అదే సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నాలుగు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్నారు చిరు, రజినీ. ఇద్దరూ కలిసి నటించిన సినిమా ఇప్పటివరకు రాలేదు. కానీ గతంలో ఆ ఛాన్స్ వచ్చినప్పటికీ ఓ ప్రొడ్యూసర్ కారణంగా మిస్ అయ్యిందట. ఆ సినిమా మరేదో కాదు.. రంగేళి. ఈ చిత్రాన్ని మిస్ చేసిన నిర్మాత అశ్వినీదత్.
ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‌కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‌తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ కాంబ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఒకానొక టైంలో రాము తనకు రెండు కథలు చెప్పారట. అవి రంగీలా, గోవిందా గోవిందా. ముందుగా రంగీలా సినిమా చేయాలనుకున్నానని.. ఈ సినిమా కోసం చిరంజీవి, రజినీకాంత్, శ్రీదేవిలను అనుకున్నారట. చిరు, రజినీల దగ్గరకు వెల్లి గెస్ట్ రోల్స్ అంటే ఏమనుకుంటారో.. అలాగే ముక్కోణపు ప్రేమకథ అవసరమా అని భావించి రంగీలా సినిమా వదిలేసినట్లు తెలిపారు. అప్పుడు గోవిందా గోవిందా సినిమా కథను ఓకే చేశారని.. ఇందులో వెంకటేశ్వర స్వామి గుడిలో దోపిడి అనే విధంగా కథ పెట్టి తీస్తే బాగుంటుందని అనిపించిందని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‌ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..
అలా గోవిందా గోవిందా సినిమాను చేశామని.. అమీర్ ఖాన్ కి రంగీలా వెళ్లిందని చెప్పుకొచ్చారు అశ్వినీదత్. లేదంటే రంగీళ సినిమాలో రజినీ, చిరు ఇద్దరు కనిపించేవారు. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..