
10 సంవత్సరాల వయసులో సినిమాల్లోకి అడుగుపెట్టి, 2500 కి పైగా చిత్రాలలో నటించి, 9 భాషలలో తన నటనతో ఎంతో మంది హృదయాల్లో చోటు సంపాదించుకుంది. కానీ తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది. ఆమె పేరు నటి సుకుమారి. ఆమె తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. సుకుమారి 1940లో తమిళనాడులోని నాగర్‌కోయిల్ ప్రాంతంలో జన్మించారు. ఆమె 7 సంవత్సరాల వయస్సులో నృత్యం నేర్చుకుంది. భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది. 1951లో అరిగ్నార్ అన్నా రాసిన ‘ఓర్ రాట్టు’ సినిమాలో ఒక పాటకు డ్యాన్స్ చేయడం ద్వారా తమిళ సినిమాలో అడుగుపెట్టిన సుకుమారి, ఎంజిఆర్ శివాజీతో సహా అనేక మంది నటులతో కలిసి నటించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
సుకుమారి తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ, సింహళ, ఇంగ్లీష్, బెంగాలీ , ఫ్రెంచ్ భాషలతో సహా 9 భాషలలో 2500 కి పైగా చిత్రాలలో నటించింది. దక్షిణ భారత సినిమాల్లో మోహన్ లాల్, కమల్ హాసన్, మహేష్ బాబులతో కలిసి నటించింది. సుకుమారి 2003 లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీని అందుకున్నారు. 2010 లో నమ్మ గ్రామం చిత్రానికి జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
నాలుగుసార్లు కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకున్న నటి సుకుమారి, 1959లో దర్శకుడు భీమ్‌సింగ్‌ను వివాహం చేసుకున్నారు. భీమ్‌సింగ్ 1978లో మరణించడంతో, సుకుమారికి 38 సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయింది.ఆ తర్వాత ఆమె తన కుమారుడు సురేష్ భీమ్‌సింగ్ ను పెంచుతూ ఒంటరిగా గడిపేసింది. కొన్ని సినిమాల్లో నటించిన సురేష్ భీమ్‌సింగ్ ప్రస్తుతం డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఒక థియేటర్ గ్రూప్‌తో కలిసి 5000 కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది సుకుమారి. 2013లో తన ఇంట్లో దీపం వెలిగిస్తున్నప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుకుమారి, మార్చి 26, 2013న మరణించింది.
Sukumari Movies
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..