Arjun Sarja: హీరో అర్జున్ సర్జా చిన్న కూతురి వెరైటీ బిజినెస్ తెలిస్తే అవాక్కే..! వ్యాపారంలో ఆమె రూటే సపరేటు..
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో జెంటిల్ మెన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అంతకు ముందు తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. ఇప్పటికీ ఆయన నటించిన ఒకే ఒక్కడు సినిమాకు బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అర్జున్.. సహాయ నటుడిగా, విలన్ పాత్రలు ఫోషిస్తున్నారు. అయితే అర్జున్ సర్జా ఫ్యామిలీలో చాలా మంది హీరోహీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు.

దక్షిణాది సినీ పరిశ్రమలో యాక్షన్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో అర్జున్ సర్జా. కన్నడ, తెలుగు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో జెంటిల్ మెన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అంతకు ముందు తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. ఇప్పటికీ ఆయన నటించిన ఒకే ఒక్కడు సినిమాకు బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అర్జున్.. సహాయ నటుడిగా, విలన్ పాత్రలు ఫోషిస్తున్నారు. అయితే అర్జున్ సర్జా ఫ్యామిలీలో చాలా మంది హీరోహీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. ఆయన మేనల్లుడు ధృవ సర్జా హీరోగా రాణిస్తున్నారు. ఇక ఆయన పెద్దు కూతురు ఐశ్వర్య కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది.
ఐశ్వర్య సర్జా తొలిసారిగా విశాల్ సరసన పట్టతు యానై సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో ప్రేమ బరహ చిత్రంలో నటించింది. కథానాయికగా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఆమె పెళ్లికి సిద్ధమయ్యింది. ప్రముఖ హాస్యనటుడు తంబీ రామయ్య కొడుకు ఉమాపతి రామయ్యతో గతేడాది నిశ్చితార్థం జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి గతేడాది అక్టోబర్ 27న చెన్నైలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థపు వేడుకను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ కూడా నెట్టింట వైరలయ్యాయి. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా జరగనుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు అర్జున్ సర్జా చిన్న కూతురి గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఆయన చిన్న కుమార్తె పేరు అంజనా అర్జున్. తండ్రిలాగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకుండా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. పారిశ్రామికవేత్తగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో హ్యాండ్‌బ్యాగ్‌ల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. గతంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సంస్థను ప్రారంభించి అంజనా అర్జున్ ను అభినందించారు. అంతేకాదు హ్యాండ్ బ్యాగ్ తయారీలో అంజనా అర్జున్ రూటే సపరేటు. హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేయడానికి ముడి పదార్థంగా పండ్ల తొక్కలను ఉపయోగిస్తున్నారు. పండ్ల తొక్కలను వాడే ప్రత్యేకమైన ఫార్ములాతో ఆమె ఈ హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తు్న్నారు. ఈ పద్దతి ప్రపంచంలో మునుపెన్నడూ ప్రయత్నించలేదు. అటు అంజనా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్స్ బిజినెస్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




