Dhanush: రజినీకాంత్ మనవళ్లను చూశారా ?.. ధనుష్ పెద్ద కొడుకు యాత్ర ఎలా ఉన్నాడంటే.. ఫోటోస్ వైరల్..
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ క్రమంలోనే శుక్రవారం చెన్నైలో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకు కూతురు ఐశ్వర్యతోపాటు.. మనవళ్లు యాత్ర, లింగతోపాటు హజరయ్యారు రజినీ. అయితే ఇప్పుడు ధనుష్ పెద్ద కొడుకు యాత్ర మాత్రం ఆ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. అతడికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. యాత్ర అచ్చం తన తండ్రిలాగే కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు ఐశ్వర్య. ప్రస్తుతం ఆమె తెరకెక్కిస్తోన్న సినిమా ‘లాల్ సలామ్’. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే సుధీర్ఘ కాలం తర్వాత తన కూతురి కోసం గెస్ట్ రోల్ చేస్తున్నారు రజినీ. లాల్ సలామ్ సినిమాలో మొయిదీన్ భాయ్ అనే ముస్లీం వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ క్రమంలోనే శుక్రవారం చెన్నైలో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకు కూతురు ఐశ్వర్యతోపాటు.. మనవళ్లు యాత్ర, లింగతోపాటు హజరయ్యారు రజినీ. అయితే ఇప్పుడు ధనుష్ పెద్ద కొడుకు యాత్ర మాత్రం ఆ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. అతడికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. యాత్ర అచ్చం తన తండ్రిలాగే కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకుని దాదాపు 2 సంవత్సరాలు కావొస్తుంది. దాదాపు 17 ఏళ్ల వైవాహిక బంధానికి వీరు ముగింపు పలికారు. అయితే వీరిద్దరు విడిపోతారని అసలు ఎవరు ఊహించలేదు. అప్పట్లో వీరి డివోర్స్ ప్రకటన అందరిని షాక్ కు గురి చేసింది. అయితే అందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. కానీ అప్పుడప్పుడు తన కుమారులను కలుసుకుంటారు ధనుష్. అయితే ఇప్పుడు ఐశ్వర్య తెరకెక్కించిన లాల్ సలామ్ ఆడియో ఫంక్షన్లో మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు యాత్ర. లింగ.
ముఖ్యంగా ధనుష్ పెద్ద కొడుకు యాత్ర అచ్చం తండ్రిలాగే ఉన్నాడంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అతడికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. త్వరలోనే యాత్ర సైతం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. లాల్ సలామ్ సినిమా వచ్చే నెల 9న అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.
“Two pillars of their universe support, love endlessly.”💗@dhanushkraja @ash_rajinikanth #Yatra #Lingaa #Dhanush #LalSalaam #CaptainMiller #ssmusic pic.twitter.com/0JTshWpBls
— SS Music (@SSMusicTweet) January 27, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




