AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Movie: ‘ఆదిపురుష్‏లో ఆ సీన్స్ చూసి బాధపడ్డాను’.. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్..

ఇప్పటివరకు దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం .. ఇప్పుడు రిపబ్లిక్ డే వీకెండ్ ఎఫెక్ట్ తో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. విస్మయం, జాంబీరెడ్డి సినిమాతో సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మరోసారి హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి ఇప్పుడు భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసిన తర్వాత మరోసారి ఆదిపురుష్ మూవీ పై ట్రోలింగ్ జరిగింది.

Hanuman Movie: 'ఆదిపురుష్‏లో ఆ సీన్స్ చూసి బాధపడ్డాను'.. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్..
Adipurush, Prashanth Varma
Rajitha Chanti
|

Updated on: Jan 27, 2024 | 8:27 PM

Share

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘హనుమాన్’ సినిమా పేరు మారుమోగుతోంది. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుడి పాత్రను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం .. ఇప్పుడు రిపబ్లిక్ డే వీకెండ్ ఎఫెక్ట్ తో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. విస్మయం, జాంబీరెడ్డి సినిమాతో సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మరోసారి హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి ఇప్పుడు భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసిన తర్వాత మరోసారి ఆదిపురుష్ మూవీ పై ట్రోలింగ్ జరిగింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఆదిపురుష్ సినిమాలోని కొన్ని సీన్స్ చూసి ఎంతో బాధపడ్డానని.. తానైతే ఎప్పటికీ అలా చేయనని అన్నాడు. “ఆదిపురుష్ సినిమాలోని కొన్ని సీన్స్ నాకు చాలా నచ్చాయి. వాటిని తెరకెక్కించిన తీరు ఆశ్చర్యపరిచింది. నేనెప్పుడు అలా చేయలేదు. అలాంటి సీన్స్ తెరకెక్కించినందుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. కానీ మరికొన్ని సన్నివేశాలు చూసి చాలా బాధపడ్డాను. వాటిని తీర్చిదిద్దిన తీరు నాకు అస్సలు నచ్చలేదు. నేను అయితే వాటిని ఇంకా బాగా చేసేవాడిని కదా అనిపించింది. నాకే కాదు ప్రతి ఫిల్మ్ మేకర్ కు అలాంటి భావనే కలుగుతుంది. ఆ సమయంలో ఒక ప్రేక్షకుడిగా నేను ఆ సన్నివేశాలను అంగీకరించలేకపోయాను. కానీ ఆ సినిమాలో కొన్ని అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. ఆ సినిమా ఫలితం నాపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. నా టీం అందరి సహకారంతోనే హనుమాన్ సినిమాను రూపొందించగలిగాను ” అంటూ చెప్పుకొచ్చారు.

తేజ సజ్జ, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన హనుమాన్ 13 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఇటు ఇండియాలోనే కాకుండా..అటు అమెరికాలోనూ సత్తా చాటుతుంది ఈ సినిమా. త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.