
యంగ్ సూపర్‌స్టార్ తేజ సజ్జా నటించిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘మిరాయ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా..రితిక నాయక్ హీరోయిన్ గా, శ్రీయా శరణ్, జగపతి బాబు, జయరామ్ వంటి స్టార్ కాస్ట్‌తో ప్రేక్షకులను అలరించింది. సెప్టెంబర్ 12, 2025న విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ సాధించి, తేజ సజ్జా మునుపటి హిట్ ‘హనుమాన్’ను మించి ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. సెప్టెంబర్ 14న మూడో రోజున ఇండియా నెట్‌లో రూ.14-15 కోట్లు సంపాదించి, మూడు రోజులకు మొత్తం రూ.44-50 కోట్లకు చేరిందని తెలుస్తుంది. అలాగే వరల్డ్‌వైడ్‌లో మూడు రోజుల్లో రూ.60 కోట్లు దాటినట్టు అంచనా.
ఇక మిరాయ్ సినిమాలో యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మిరాయ్ సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా.? మంచు మనోజ్ రైట్ హ్యాండ్ నటించి అదరగొట్టింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఆమె ఇరగదీసిందనే చెప్పాలి. ఆమె పేరు తాంజ కెల్లర్.
ఆమె ఒక హాలీవుడ్ నటి. ప్రధానంగా యూరపియన్ సినిమాల్లో, జర్మన్ ఫిల్మ్స్‌లో నటిస్తుంది. ఆమె కెరీర్‌లో యాక్షన్, థ్రిల్లర్ జానర్‌లు ఎక్కువగా ఉంటాయి. తాంజ కెల్లర్ జర్మన్ లో పుట్టింది. యాక్షన్ ట్రైనింగ్ తీసుకుని, స్టంట్ వర్క్‌లో ప్రవీణ్యం పొందింది. “మిరాయ్” సినిమాతో ఆమె ఇండియన్ సినిమాకు పరిచయం అయ్యింది. అలాగే ఆమె పాత్ర సినిమాకు అదనపు హైలైట్ అయింది. ఆమె పాత్ర మిరాయ్ లో చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. అదేవిధంగా సినిమాలో ఆమె ఫైట్ సీన్స్, రూథ్‌లెస్ క్యారెక్టర్‌తో సినిమాను స్టీలింగ్ చేసిందని, సర్‌ప్రైజ్ స్టార్‌గా నిలిచిందని విమర్శకులు ప్రశంసించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.