బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో వరుస సినిమాలను లైనప్ చేస్తున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న కిరణ్ అబ్బవరం తాజా చిత్రం మీటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు రమేష్ కాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీమూవీ మేకర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. శుక్రవారం కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా మీటర్ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.
ఈ ఫస్ట్‌లుక్‌లో కలర్‌ఫుల్ షర్ట్‌తో.. ఫుల్‌మాసివ్ లుక్‌తో కనిపిస్తున్నాడు కథానాయకుడు కిరణ్. ఈ లుక్‌తో పాటు టైటిల్ కూడా అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. మోషన్‌పోస్టర్‌కు సాయి కార్తీక్ అందించిన మాసివ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తుంటే ఇది పక్కా కమర్షియల్ పైసా వసూల్ చిత్రంగా అనిపిస్తుంది. ఈ చిత్రం కిరణ్ అబ్బవరం ఇమేజ్‌ను రెట్టింపు చేసే విధంగా వుంటుందని చెబుతుంది చిత్రబృందం. అత్యులరవి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సాయికార్తీక్, సంభాషణలు: రమేష్ కాదూరి అందిస్తున్నారు.