Rakshasudu 2: “రాక్షసుడు 2″లో హీరోగా ఆ స్టార్ నటించనున్నాడట !

బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమా మంచి విజయాన్ని సంధించిన విషయం తెలిసిందే. తమిళ్ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది.

Rakshasudu 2: రాక్షసుడు 2లో హీరోగా ఆ స్టార్ నటించనున్నాడట !
Rakshasudu 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 23, 2022 | 8:24 PM

బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు(Rakshasudu ) సినిమా మంచి విజయాన్ని సంధించిన విషయం తెలిసిందే. తమిళ్ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. అల్లుడు శ్రీను సినిమా తరవాత బెల్లంకొండకు హిట్ అందించిన సినిమా ఇది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ అని ప్రకటించిన దగ్గర నుంచి ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ లో హీరోగా ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే మొదటి పార్ట్ లో నటించిన బెల్లంకొండనే ఈ సినిమాలోనూ హీరోగా చేస్తారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మరో హీరో పేరు కూడా వినిపిస్తోంది. రాక్షసుడు సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు దర్శకుడు రమేష్ వర్మ కూడా లీడ్ రోల్ లో మరో హీరోని తీసుకోవాలనుకున్నారు.ఈ మేరకు చాలా మంది హీరోల పేర్లను సంప్రదించారట.చివరిగా  కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే ఆయన నటించిన విక్రాంత్ రొణ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు సుదీప్ రాక్షసుడు 2లో నటిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. హారర్ థ్రిల్లర్ గా సినిమా రూపొందుతున్న  ఈ సినిమాలో మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా నటించనుందని టాక్. అలాగే విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?