AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Indian Idol Season 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 నుంచి కేశవ్ రామ్ ఎలిమినేట్..

ఈ తెలుగు ఓటీటీ సంస్థ అందిస్తున్న అద్భుతమైన కార్యక్రమాల్లో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. ఈ సింగింగ్ కాంపిటేషన్ విజయవంతంగా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎంతో మంది ప్రతిభావంతులను పరిచయం చేసిన ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లోను అద్భుతమైన సింగర్స్ ను పరిచయం చేసింది.

Telugu Indian Idol Season 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 నుంచి కేశవ్ రామ్ ఎలిమినేట్..
అంతే కాదు, వారి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం నుంచి కూడా అప్లాజ్‌ వచ్చింది.. ఈ విషయాలన్నిటినీ తనివితీరా చూడాలంటే డోంట్‌ మిస్‌ ఆహా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3.. ఈ వారం ఎపిసోడ్స్.
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2024 | 4:59 PM

Share

అదిరిపోయే కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది ఆహా. ఇక ఈ తెలుగు ఓటీటీ సంస్థ అందిస్తున్న అద్భుతమైన కార్యక్రమాల్లో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. ఈ సింగింగ్ కాంపిటేషన్ విజయవంతంగా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 3 సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఎంతో మంది ప్రతిభావంతులను పరిచయం చేసిన ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లోను అద్భుతమైన సింగర్స్ ను పరిచయం చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ నుంచి ఇప్పుడు ఒకొక్కరిగా ఎలిమినేట్ అవుతున్నారు. జూన్ 14, 2024న ప్రారంభమైనప్పటి నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ 3లో ఆరుగురు పోటీదారులు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు తన పాటలతో ఆకట్టుకున్న కేశవ్ రామ్ ఎలిమినేట్ అయ్యాడు. దాంతో అతని అభిమానులు, ప్రేక్షకులు షాక్ అయ్యారు.

ఇది కూడా చదవండి :Vikramarkudu: విక్రమార్కుడు “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

కేశవ్ రామ్ ఎలిమినేట్ అవ్వడంతో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఊహించని మలుపు తిరిగింది. తెలుగు ఇండియన్ ఐడల్ 3లో కేశవ్  తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అద్భుతమైన పాటలను ఆలపించి మెప్పించాడు.  ఇప్పుడు అతని ఎలిమినేషన్ అభిమానులను అలాగే  మిగిలిన కంటెస్టెంట్స్ ను షాక్ అయ్యేలా చేసింది.  కేశవ్‌కి ముందు, షో కుశాల్ శర్మ, హరి ప్రియ, రాంజీ శ్రీ పూర్ణిమ, శ్రీ ధృతి, అభిగ్న, సాయి వల్లభ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓట్లు జడ్జ్ ల స్కోర్‌ ద్వారా ఎలిమినేషన్‌లు జరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరో భార్య..

రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్స్ లో కేశవ్ రామ్, శ్రీ కీర్తి, స్కంద డేంజర్ జోన్‌లో ఉన్నారు. అత్యధిక ప్రేక్షకుల ఓట్లతో స్కంద సేవ్ అవ్వగా.. అతి తక్కువ ఓట్లతో కేశవ్ ఎలిమినేట్ అయ్యాడు. దాంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. సింగర్ కార్తీక్ నవంబర్ 9న హైదరాబాద్‌లో అలాగే సెప్టెంబర్ 28న తిరుపతిలో జరగబోయే కాన్సర్ట్ లో పాల్గొనవలసిందిగా కేశవ్‌ను ఆహ్వానించాడు.

ఇది కూడా చదవండి : Lakshmi Manchu: అయ్యయ్యో.. మంచు లక్ష్మీ ఇలా అయ్యిందేంటీ..! మూతి పగిలిందంటూ..

అలాగే గెస్ట్ గా హాజరైన హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ..  “నా ఫైటింగ్ డేస్ లో, సక్సెస్ కోసం నేను చాలా రోజులు ఎదురుచూశాను. యాక్టింగ్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ షోలో విజేతకు  బాలీవుడ్ లో ఓ పెద్ద బ్యానర్ లో నటించే ఛాన్స్ వస్తుందని న్నారు ..నా పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ, నేను నాలుగో రౌండ్‌లో ఎలిమినేట్ అయ్యాను. కేశవ్ ఎలిమినేషన్ చూడగానే నాకు ఆ రోజు గుర్తుకు వచ్చింది. నా ఎలిమినేషన్ తర్వాత నేను చాలా నిరాశపడ్డాను. నా స్వంత సామర్థ్యాలను ప్రశ్నించుకున్నాను. ఆ షోలో విన్నర్  ఇంతవరకు సినిమా చేయలేదు. కానీ నేను హీరోని అయ్యా..  ప్రేక్షకుల నుంచి నాకు లభించిన ప్రేమ అపారమైనది. కేశవ్, మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను ఈ కథను పంచుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు నవీన్.

ఈ సూపర్ ఎనర్జిటిక్ ఎపిసోడ్ చూసి తీరాల్సిందే.. ఆహా యాప్ లింక్ కోసం ఇక్క క్లిక్ చేయండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.