Keerthy Suresh: దసరా బారాత్ సాంగ్ డాన్స్ కోసం కీర్తిసురేష్ అన్ని టేకులు తీసుకుందా.?

తన డ్యాన్స్‌ మేనియో ఏంటో అందరికీ చూపించారు. పెళ్లి బారత్ డ్యాన్స్ తో.. థియేటర్లలో అరుపులు వచ్చేలా చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ డ్యాన్స్ కోసం తాను పడిన కష్టం బయటికి రావడంతో.. మరో సారి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు.

Keerthy Suresh: దసరా బారాత్ సాంగ్ డాన్స్ కోసం కీర్తిసురేష్ అన్ని టేకులు తీసుకుందా.?
Keerthy Suresh

Updated on: Apr 11, 2023 | 1:34 PM

టైం దొరికితే.. చాలు.. ఇన్‌స్టాలో డ్యాన్స్ రీల్స్‌ చేసి.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఫిదా చేసే కీర్తి సురేష్.. తాజాగా దసరా సినిమాలో.. ఇదే పని దిమ్మతిరిగే రేంజ్లో చేశారు. ఓ 51సెకండ్ల నాన్‌ స్టాప్‌ మాస్‌ డ్యాన్స్ తో.. తన డ్యాన్స్‌ మేనియో ఏంటో అందరికీ చూపించారు. పెళ్లి బారత్ డ్యాన్స్ తో.. థియేటర్లలో అరుపులు వచ్చేలా చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ డ్యాన్స్ కోసం తాను పడిన కష్టం బయటికి రావడంతో.. మరో సారి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు.

నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల డైరక్షన్లో.. తెరకెక్కిన దసరా సినిమా సూపర్ డూపర్ హిట్టైపోయింది. వందకోట్ల సినిమాగా రికార్డుకెక్కింది. ఇక ఈ కమ్రంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిఏ కీర్తి సురేష్ బారాత్‌ డ్యాన్స్ బిట్ అందర్నీ ఫిదా చేస్తోంది. ఫిదా చేయడమే కాదు.. ఈ డ్యాన్స్ బిట్ కోసం కీర్తి 25 టేకులు చేశారని డైరెక్టర్ అండ్ హీరో నాని రివీల్ చేయడం.. ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.

రీసెంట్ గా ఓ ఇంటర్య్యూలో మాట్లాడిన శ్రీకాంత్ ఓదెల.. వెన్నెల బారాత్ బిట్ కోసం.. విపరీతంగా కష్టపడ్డారన్నారు. ఢీ ఫేం జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ బారాత్‌ బీట్‌ను.. సింగిల్ టేక్ లో చేయాలని.. సో ఈ బిట్‌కు దాదాపు 25 టేకుల వరకు కీర్తి తీసుకుందని అన్నారు ఆయన. అయితే అన్ని టేకులు పట్టినా కూడా.. ప్రతీ సారి అదే ఎనర్జీ.. అదే జోష్‌తో కీర్తి డ్యాన్స్ చేశారన్నారు. అందుకే ఆమె మహానటి అయిందని పొగిడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి