Keerthy Suresh : ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. కానీ ఆ తర్వాత ఆరు నెలలు అవకాశాలు రాలేదు.. కీర్తి సురేష్..
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చిన్న వయసులోనే తెరంగేట్రం చేసి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. అయితే తన కెరీర్ మలుపు తిప్పిన ఓ సినిమా తర్వాత తనకు దాదాపు 6 నెలలు సినిమా అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది.

హీరోయిన్ కీర్తి సురేష్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. మలయాళీ సినిమాతో తెరంగేట్రం చేసినప్పటికీ.. తెలుగులోనే అత్యధిక చిత్రాల్లో నటించింది. తెలుగులో నేను శైలజ సినిమాతో అడుగుపెట్టిన ఆమె.. మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. కానీ ఈ సినిమా తర్వాత తనకు ఆరు నెలలు ఏ అవకాశం రాలేదని తెలిపింది కీర్తి. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఆమె యాక్టింగ్, లుక్స్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీ హిట్ తర్వాత కీర్తి పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆమె అవకాశాల కోసం ఎదురుచూసిందట.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ.. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర చాలా పవర్ ఫుల్. ఈ సినిమా తర్వాత మరో సినిమాలో తనను అడియన్స్ అంగీకరిస్తారో లేదో అని దర్శకులు భయపడ్డారని.. దీంతో తనకు ఆఫర్స్ రాలేదని తెలిపింది. కొంతమంది మాత్రం తనను సీరియస్ పాత్రలకు మాత్రమే ఎంపిక చేశారని తెలిపింది. దీంతో కమర్షియల్ సినిమాలు తీసేవారు తన దగ్గరకు రాలేదని తెలిపింది. ఈ సినిమాతో స్టార్ డమ్ వచ్చినప్పటికీ ఆఫర్స్ కోసం ఆరు నెలలు ఎదురుచూసినట్లు తెలిపింది. ఆ సమయంలో తాను చాలా మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
ఇటీవలే తన స్నేహితుడు ఆంటోనిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్. పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘రివాల్వర్ రీటా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆమె మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..




