Keerthy Suresh: అందాల భామ కీర్తిసురేష్ కొత్త ఫ్రెండ్స్‌ను చూశారా.. నెట్టింట వైరల్
తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తోన్న కీర్తిసురేష్. ఆయా సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటుంది. తెలుగులో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. కేరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న కీర్తి.. ఈ మధ్య అందాలతో రెచ్చిపోతుంది

అందాల భామ కీర్తిసురేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తోన్న కీర్తిసురేష్. ఆయా సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటుంది. తెలుగులో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. కేరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న కీర్తి.. ఈ మధ్య అందాలతో రెచ్చిపోతుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారిపాట సినిమాలో కీర్తిసురేష్ గ్లామర్ తో ఆకట్టుకుంది. అందాలు ఆరబోస్తూ కవ్వించింది కీర్తిసురేష్. అలాగే సోషల్ మీడియాలోనూ పరువాల వలలు విసురుతోంది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నాని హీరోగా నటిస్తోన్న దసరా సినిమాలో చేస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా నటిస్తోంది.
అయితే తాజాగా కీర్తి తన కొత్త ఫ్రెండ్స్ ను పరిచయం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు వీడియోలను పంచుకుంది. కీర్తి జంతుప్రేమికురాలన్న విషయం తెలిసిందే. దసరా సినిమా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆ సినిమా షూటింగ్ సమయంలో మేకలు, ఆవులు, లేగదూడలు, కోళ్లు లతో ఆడుకుంటూ షూటింగ్ ను ఎంజాయ్ చేసింది.
ఆ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. ఇక దసరా సినిమా విషయానికొస్తే ఈ మూవీలో కీర్తి వెన్నెల అనే డీ గ్లామర్ పాత్రలో నటిస్తోంది. నాని మునుపెన్నడూ కనిపించనంత మాస్ పాత్రలో కనిపించనున్నాడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram




