AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi Movie: ‘ఇరుముడి’ సూపర్ హిట్ సాంగ్.. ఫుల్ వీడియో వచ్చేసింది.. మరెందుకు లేటు మీరూ చూసేయండి

మాస్ మహరాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ఇరుముడి. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

Irumudi Movie: 'ఇరుముడి' సూపర్ హిట్ సాంగ్.. ఫుల్ వీడియో వచ్చేసింది.. మరెందుకు లేటు మీరూ చూసేయండి
Irumudi Movie
Basha Shek
|

Updated on: Sep 06, 2026 | 3:39 PM

Share

మాస్ మహరాజా రవితేజ- శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి సినిమా ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతుండడం విశేషం. చాలా చోట్ల ట్రాక్టర్లతో వెళ్లి మరీ థియేటర్లలో ఈ సినిమాను చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇరుముడి సినిమాను నిర్మించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన నక్షత్ర ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. అలాగే కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన ఈ పాటలు సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించాయి.

ఇదిలా ఉంటే ఇరుముడి సినిమా నుంచి తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీకమాసం ఫుల్ వీడియో పాటను ఇరుముడి టీమ్ విడుదల చేసింది. ఈ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించడం విశేషం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ పాడడంతో పాటు కంపోజ్ చేశారు. అయ్యప్ప స్వామి భక్తి దీక్ష విశిష్టతను, ఆధ్యాత్మిక పరివర్తనను అత్యంత హృద్యంగా ఆవిష్కరిస్తూ ఈ ‘కార్తీకమాసం..’ నూ రూపొందించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూట్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. కాగా ఇరుముడి సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ‘మల్లెపూల పల్లకి సాంగ్’కు ఆడియెన్స్ థియేటర్లలో పూజలు, హారతులు పడుతున్నారు. ఇటీవలే ఈ సాంగ్ ఫుల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

రిలీజై మూడు వారాలవుతున్నా తగ్గని ఇరుముడి జోరు..

ఇరుముడి కార్తీక మాసం ఫుల్ వీడియో సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రెండు నెలల్లో ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం..!
రెండు నెలల్లో ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం..!
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీ ఇదిగో
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీ ఇదిగో
ఆ సినిమాలో కథ ఉందా అని అడిగా..
ఆ సినిమాలో కథ ఉందా అని అడిగా..
ఇలా చేస్తే చూస్తూ ఉండిపోకండి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు
ఇలా చేస్తే చూస్తూ ఉండిపోకండి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే