AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

32 నెలల్లో 3.77 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు.. పెండింగ్ చలాన్ల వసూలుకు పోలీసుల మాస్టర్ ప్లాన్!

తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 32 నెలల్లో రాష్ట్రవ్యా్ప్తంగా రికార్డు స్థాయిలో 3.77 కోట్ల కేసులు నమోదయ్యాయి. వీటిలో ముఖ్యంగా హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం, ఓవర్ స్పీడింగ్ వంటివి ప్రధాన ఉల్లంఘనలని పోలీస్ శాఖ పేర్కొంది.

32 నెలల్లో 3.77 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు.. పెండింగ్ చలాన్ల వసూలుకు పోలీసుల మాస్టర్ ప్లాన్!
Telangana Traffic Violations Soar
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Oct 14, 2026 | 3:04 PM

Share

తెలంగాణలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గత 32 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 3 కోట్ల 77 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ వాహనదారుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంపై ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ప్రధానంగా హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడింగ్, సీటు బెల్టు పెట్టుకోకపోవడం రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ ఉల్లంఘనలే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆధునిక సీసీటీవీ కెమెరాలు, ఏఐ బేస్డ్ ట్రాఫిక్ సర్వేలెన్స్ సిస్టమ్ సహాయంతో ఈ ఉల్లంఘనలను సులభంగా పోలీసులు గుర్తిస్తున్నారు. రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, చలాన్ల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉండటం గమనార్హం.

భారీగా పెండింగ్‌లో చలాన్లు

ఒకవైపు కోట్లాది కేసులు నమోదవుతుంటే, మరోవైపు వాటి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన వందలాది కోట్ల రూపాయల చలాన్ మొత్తం ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయింది. చాలామంది వాహనదారులు చలాన్లను సకాలంలో చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో పెండింగ్ బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు అమలు చేస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కేవలం జరిమానాల భయంతో కాకుండా, తమ ప్రాణ భద్రత కోసమైనా ప్రతీ ఒక్కరూ నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని, ప్రయాణంలో హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలతో పాటు లైసెన్స్ రద్దు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..