AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మొబైల్ ఫోన్ల నిషేధంపై కీలక నిర్ణయం!

Tamil Nadu Temple News: తమిళనాడులోని 52 ప్రముఖ ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై విధించిన నిషేధాన్ని అధికారులు సడలించారు. ఇకపై భక్తులు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ఆలయాల్లోకి తీసుకెళ్లవచ్చు. అయితే, ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం, సెల్ఫీలు, రీల్స్ చిత్రీకరించడంపై నిషేధం కొనసాగనుంది.

ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మొబైల్ ఫోన్ల నిషేధంపై కీలక నిర్ణయం!
Tamil Nadu Temple News
Rajashekher G
|

Updated on: Oct 14, 2026 | 2:49 PM

Share

Tamil Nadu Temples: తమిళనాడులోని ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఆలయాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై విధించిన నిషేధాన్ని సడలిస్తూ హిందూ మత, ధార్మిక దానాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తులు తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ఆలయాల్లోకి తీసుకెళ్లవచ్చు. అయితే, ఆలయ ప్రాంగణంలో ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం, సెల్ఫీలు దిగడం, రీల్స్ చిత్రీకరించడంపై నిషేధం మాత్రం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

52 ప్రముఖ ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం

తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు, ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడే లక్ష్యంతో 2026 సెప్టెంబర్ 1 నుంచి 52 ముఖ్యమైన ఆలయాల్లో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. ఈ జాబితాలో పళని దండాయుధపాణి స్వామి ఆలయం, తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, మదురై మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయం, రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం, తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, మదురై అళగర్ ఆలయం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

మొబైల్ ఫోన్ల నిషేధానికి కారణమేంటి?

ఆలయాల్లో భక్తులు ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునేందుకు, దేవతా విగ్రహాల ఫొటోలు, వీడియోలు తీయడం, రీల్స్ చిత్రీకరించడం వంటి కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ నిషేధాన్ని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆలయాల పవిత్రతను కాపాడటంతో పాటు, ఇతర భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం కూడా ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ధార్మిక శాఖ వివరించింది.

ఇవి కూడా చదవండి

భక్తులకు తప్పని తిప్పలు.. ఫోన్ డిపాజిట్ కేంద్రాల వద్ద రద్దీ

మొబైల్ ఫోన్లను ఆలయాల్లోకి అనుమతించకపోవడంతో భక్తుల కోసం ఆలయాల ప్రాంగణాల్లో ప్రత్యేక భద్రతా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఒక్కో ఫోన్‌ను రూ.5 రుసుముతో భద్రపరిచే ఏర్పాట్లు చేశారు. అయితే, దర్శనం పూర్తయిన తర్వాత ఫోన్లను తిరిగి తీసుకునేందుకు భక్తులు చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో ఫోన్లను అప్పగించేందుకు, తిరిగి తీసుకునేందుకు గంటకు పైగా సమయం పడుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్లపై నిషేధాన్ని తొలగించాలని భక్తుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి.

కొత్త నిబంధనలు ఇవే.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిందే!

భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఫోన్ల భద్రతా కేంద్రాల వద్ద ఏర్పడుతున్న రద్దీని పరిగణనలోకి తీసుకున్న అధికారులు నిబంధనలను సడలించినట్లు ప్రకటించారు. కొత్త విధానం ప్రకారం భక్తులు తమ మొబైల్ ఫోన్లను ఆలయాల్లోకి తీసుకెళ్లవచ్చు. అయితే, ఆలయంలోకి ప్రవేశించే ముందే ఫోన్లను తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయాలి.

మొబైల్ ఫోన్లను తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ, వాటిని ఫొటోలు, వీడియోలు తీయడానికి ఉపయోగించకూడదు. దేవతా విగ్రహాలు, పూజా కార్యక్రమాలను చిత్రీకరించడం, సెల్ఫీలు దిగడం, రీల్స్ చేయడం, ఆలయ ప్రాంగణంలోని దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వంటి వాటిపై నిషేధం కొనసాగుతుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మొత్తంగా, మొబైల్ ఫోన్లను భద్రతా కేంద్రాల్లో అప్పగించే ఇబ్బందుల నుంచి భక్తులకు ఉపశమనం లభించనుంది. అయితే, ఆలయాల పవిత్రతను కాపాడేందుకు ఫొటోగ్రఫీ, వీడియో రికార్డింగ్‌పై ఉన్న ఆంక్షలను మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Follow Us
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ శాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ శాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..