OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో మోహన్‌లాల్ కూతురి బ్లాక్ బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ ఇటీవలే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఓ సర్వైవల్ థ్రిల్లర్ ఇటీవలే థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ ఇటీవలే సినిమాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తుడక్కం’ (Thudakkam). ‘2018’తో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. విస్మయ మోహన్‌లాల్ తో పాటు ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ కుమారుడు ఆశిష్ జో ఆంటోనీ ఈ సినిమాతోనే అరంగేట్రం చేశాడు. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక అతిథి పాత్రలో మెరిశారు. ఈ ఏడాది ఆగస్టు 7 న థియేటర్లలో రిలీజై తుడక్కం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. తుడక్కం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 18 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది జియో హాట్ స్టార్. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకేసారి ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
తుడక్కం సినిమా విషయానికి వస్తే.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాబీ కురియన్, సాయి కుమార్, మనోజ్ కే జయన్, కేబీ గణేష్ కుమార్, చిప్పి రంజిత్, కొట్టాయం రమేష్, జయ కురుప్, జాఫర్ ఇడుక్కి, టీజీ రవి, మియా జార్జ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. తుడక్కం సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మీను (విస్మయ) అనే మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్, ఒక క్రూరమైన నేరస్థుడి (ఆశిష్) బారి నుంచి తనను, తన తండ్రిని కాపాడుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ విద్యను ఉపయోగించి ఎలా పోరాడింది అన్నదే ఈ సినిమా స్టోరీ. ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఒక కీలకమైన క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్‌గా కేమియో (అతిథి) పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తుడక్కం సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
జియో హాట్ స్టార్ లో తుడక్కం.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
Vismaya Mohanlal’s Thudakkam will be streaming on JioHotstar from September 18.@jude_anthany @mohanlal @antonypbvr @aashirvadcine #Thudakkam #ThudakkamOnJioHotstar #SocialThriller #JioHotstar pic.twitter.com/QvYjmDiHyo
— JioHotstar Malayalam (@JioHotstarMal) September 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




