Ariyana Glory: ‘మా దీవెనలు చాలా గొప్పవి’.. అరియానా కామెంట్స్‌పై ట్రాన్స్‌జెండర్ల రియాక్షన్.. వీడియో ఇదిగో
ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ ఇటీవల ట్రాన్స్ జెండర్లపై చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వీడియోలు కూడా బాగా వైరలయ్యాయి. ఈ విషయంలో చాలామంది అరియానాకే మద్దతు నిచ్చారు. అయితే తాజాగా ఈ వివాదంపై కొందరు ట్రాన్స్ జెండర్స్ స్పందించారు.

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియానా ఇటీవల ట్రాన్స్ జెండర్ల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగ వైరల్ అయ్యాయి. తన ఇంటి గృహ ప్రవేశం సందర్భంగా కొందరు ట్రాన్స్ జెండర్లు తమను ఎలా ఇబ్బంది పెట్టారో చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేసింది అరియానా. అందులో .. ‘ ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటాం. అంత కష్టంతో కట్టుకున్న ఇంటి గృహప్రవేశాన్ని.. అంతే సంతోషంగా జరుపుకొంటాము. అయితే ఆ సంతోషాన్ని పాడు చేయడానికి కొంతమంది హిజ్రాలు వచ్చి డబ్బులు కావాలని డిమాండ్ చేయడం అసలు బాగోలేదు. పైగా ఇంటి డోర్ పై లేదా గోడలపై చాక్‌పీస్‌లతో నంబర్లు వేయడం చాలా దారుణం’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది అరియానా. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై కొంత మంది ట్రాన్స్ జెండర్లు స్పందించారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అరియానకు క్షమాపణలు చెబుతూ వీడియోలు రిలీజ్ చేశారు.
యూట్యూబర్ గా సోషల్ మీడియాలో మంచి పేరు సొంతం చేసుకున్న ట్రాన్స్ జెండర్ వర్షిత తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు. ‘రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ అరియానా గారు తన ఇంటి గృహప్రవేశానికి వచ్చిన మా ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్స్ కొంతమంది.. ఇచ్చింది తీసుకోకుండా ఇబ్బంది పెట్టారు అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.. దీనికి మా ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్స్ తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను ఒకటైతే చెప్పగలుగుతాను అందరూ ఒకేలా ఉండరు. ఎవరో ఒక ట్రాన్స్ జెండర్ ఎక్కడో తప్పు చేయడం వల్ల.. మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ ఇలాంటి వాళ్లే అని మాపై నింద వేయడం చాలా బాధాకరం. ఇలాంటి ఎన్నో సంఘటనలు మమ్మల్ని మరింత బాధిస్తున్నాయి. అందుకు నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. మా ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్స్ కి ఎంత చెప్పినా కొంతమంది ఇలాంటి అరాచకాలు చేస్తూనే ఉన్నారు. మీకు ఎక్కడైనా అలాంటి వాళ్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. వారిపై యాక్షన్ తీసుకోమని చెప్పండి. అంతే కానీ ఇలా మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తాన్ని నిందించకండి. దీనిని మేము తట్టుకోలేకపోతున్నాం. మాలో కూడా చాలా మంది నీతి నిజాయితీగా ఉంటున్నారు. ఇచ్చింది తీసుకొని.. ప్రేమానురాగాలు పంచే వాళ్లు చాలామంది ఉన్నాం.. దయచేసి అందరిని అనకండి’ అని రిక్వెస్ట్ చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేయండి..
View this post on Instagram
ఇదే విషయంపై మరో ట్రాన్స్ జెండర్ స్నేహ వరంగల్ కూడా స్పందించారు.. ‘ ట్రాన్స్ బాయ్స్ మీరు ఎక్కడైనా సరే దయచేసి ఇలా తప్పుగా ప్రవర్తించకండి. మీ ప్రవర్తన మొత్తం కమ్యూనిటీనే తప్పుదోవ పట్టించేలా చేస్తోంది. ఒకరిని ఏదైనా అడిగేటప్పుడు ఆచితూచి అడగడం కానీ, ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు ఆ ఇంటి వాళ్లతో పద్ధతిగా మాట్లాడండి. వాళ్లు ఇచ్చేది ఏదైతే ఉందో అర్థం చేసుకొని దానిని సంతోషంగా స్వీకరించండి. ట్రాన్స్ జెండర్స్ దీవెనలు చాలా గొప్పవి .. దయచేసి అర్థం చేసుకోండి’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




